Donald Trump: బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికా మాజీ కమిషనర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్(USCIRF) జానీ మూర్ హెచ్చరిక జారీ చేశారు. ఈ దాడులను బాధిత వర్గానికి మాత్రమే కాకుండా ఆ దేశ అస్థిత్వ ముప్పుగా అభివర్ణించారు. బైడెన్ ప్రభుత్వం బంగ్లాదేశ్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదని, జనవరిలో డొనాల్డ్ ట్రంప్ రాబోతున్నారు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ తన బెస్ట్ టీమ్‌తో పదవిని చేపట్టబోతున్నారని ఆయన అన్నారు. అతడి టీం భారత్‌ని మిత్రదేశంగా చూస్తోందని చెప్పారు.
Read Also: Minister BC Janardhan Reddy: కాటసానికి మంత్రి జనార్దన్ రెడ్డి సవాల్..
ప్రస్తుత అమెరికా ప్రభుత్వం బంగ్లాదేశ్‌పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉందని మూర్ అన్నారు. అయితే, రానున్న ట్రంప్ పాలనలో విదేశంగ విధానం మారబోతున్నట్లు చెప్పారు. అమెరికన్ విలువలతో నిండిన ట్రంప్ టీం మెరుగైన భవిష్యత్ కోసం పనిచేస్తుందని చెప్పారు. భారతదేశంతో ఇంతకుముందు ఎప్పుడూ లేని సహకారాన్ని మీరు చూస్తారని ఆయన చెప్పారు.
బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుని మూర్ ఖండించారు. ప్రపంచ క్రైస్తవ సమాజం బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజానికి సంఘీభావంగా నిలుస్తుందని చెప్పారు. కృష్ణదాస్ అరెస్టుపై భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీలకు రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్‌ని కోరింది. కృష్ణదాస్‌ని దేశద్రోహం కేసులో జైలులో నిర్భందించింది. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా అక్కడి ఇస్లామిక్ మతోన్మాద మూక హిందువులను, వారి ఇళ్లు, ఆస్తులు, దేవాలయాలను టార్గెట్ చేస్తున్నాయి. ఈ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.