Site icon NTV Telugu

Donald Trump Tariffs: ట్రంప్‌ సుంకాల లిస్ట్.. 70 దేశాలపై టారిఫ్‌ల పూర్తి జాబితా ఇదే!

Donald Trump

Donald Trump

Donald Trump Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి టారిఫ్‌లు బాంబు పేల్చాడు. దాదాపు 70కి పైగా దేశాలపై తాజాగా సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం పెట్టాడు. దీంతో, కొత్త సుంకాలు ఈరోజు (ఆగస్టు 1న) నుంచి అమల్లోకి అమలులోకి రానున్నాయి. అయితే, కొత్తగా విధించిన వాటిలో అత్యధికంగా సిరియాపై 41 శాతం, కెనడాపై 35 శాతం, భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

Read Also: AP Liquor Scam Case: విజయవాడ ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్‌ రెడ్డి

అయితే, బ్రిక్స్‌ దేశాలపై సుంకాల మోత మోగిస్తానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నంత పని చేసేశాడు. భారత్‌పై 25శాతం సుంకాలను విధించిన ఆయన.. బ్రెజిల్‌పై సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచారు. కొత్తగా విధించిన టారీఫ్స్ ఇవాళ్టి నుంచే ఇవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. మరోవైపు తమ పొరుగు దేశమైన మెక్సికోపై కొంత కరుణ చూపించారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కోసం 90 రోజుల గడువు ఇచ్చారు. ఈ సమయంలో 25 శాతం సుంకం అమల్లో ఉంటుందని వెల్లడించారు.

ఆయా దేశాలపై టారిఫ్‌ల వివరాలు..
* సిరియా- 41 శాతం సుంకం..
* లావోస్‌- 40 శాతం సుంకం
* మయన్మార్‌- 40 శాతం సుంకం
* స్విట్జల్యాండ్‌- 39 శాతం సుంకం
* ఇరాక్‌- 35 శాతం సుంకం
* సెర్బియా-35 శాతం సుంకం
* భారత్‌- 25 శాతం సుంకం
* పాకిస్తాన్‌- 19 శాతం సుంకం
* బంగ్లాదేశ్‌- 20శాతం సుంకం
* శ్రీలంక- 20 శాతం సుంకం

Read Also: Yuzvendra Chahal: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. విడాకులపై మౌనం వీడిన చాహల్

కాగా, భారత్‌పై 25 శాతం సుంకాలు పెనాల్టీతో కలిపి ఈరోజు ( ఆగస్టు 1వ తేదీ) నుంచి ఇవి అమల్లోకి వస్తాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. భారత్‌ మిత్రదేశమే అయినా.. టారీఫ్స్ ఎక్కువగా ఉండటంతో పాటు రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులు, చమురు కొనుగోలు చేయడంతోనే భారీగా సుంకాలను విధించినట్లు చెప్పుకొచ్చారు. అలాగే, ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటి అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ప్రకటనపై భారత్‌ రియాక్ట్ అయింది. ద్వైపాక్షిక వాణిజ్యంపై ట్రంప్‌ చేసిన ప్రకటనను గమనించాం.. సుంకాల ప్రభావంపై రిసెర్చ్ చేస్తున్నాం.. రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి తమ దేశం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

Exit mobile version