NTV Telugu Site icon

Aishwarya Rajinikanth: ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం.. దొరికిన దొంగలు..

Aishwarya Rajinikanth

Aishwarya Rajinikanth

Aishwarya Rajinikanth: స్టార్ హీరో ధనుష్ భార్య, సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రాజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలో పోయెస్ గార్డెన్ లో ఉన్న ఆమె ఇంటి నుంచి 100 సవర్ల బంగారు ఆభరణాలు, 30 గ్రాముల వజ్రాభరణాలు, 4 కిలోల వెండి, ఆస్తి పత్రాలు దొంగతనానికి గురయ్యాయి. ఇది ఇంటి దొంగల పనిగా పోలీసులు తేల్చారు. ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి ఈశ్వరి, డ్రైవర్ వెంకటేశన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిని తేనాంపేట ఇ-3 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన అన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. వణికిన ఉత్తర భారతం..

ఈశ్వరి గత 18 ఏళ్లుగా ఐశ్వర్య రజినీకాంత్ నివాసంలో పనిచేస్తుందని, వెంకటేశన్ సహాయంతో పోయెస్ గార్డెన్ నివాసంలో ఉంచిన లాకర్‌లోని నగలను చోరీ చేసిందని పోలీసులు తెలిపారు. దొంగిలించిన విలువైన వస్తువులను ఉపయోగించి చెన్నైలో ఇల్లు కూడా కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2019లో ఐశ్వర్య రజినీకాంత్ చెల్లిలు సౌందర్యకు వివాహంలో ధరించిన ఆభరణాలు పోయేస్ గార్డెన్ నివాసంలోని లాకర్ ఉంచారు. ఆ లాకర్ తాళాలు సెయింట్ మేరీస్ రోడ్ లోని తన ఫ్లాట్ లోనే ఉన్నాయని, ఈ ఏడాది ఫిబ్రవరి 10న లాకర్ తెరిచి చూడగా.. 18 ఏళ్లుగా కూడబెట్టిన నగలు కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 3.60 లక్షల విలువైన డైమండ్ సెట్లు, పురాతన బంగాలరు ముక్కుల, నవరత్నం సెట్లు, గాజులు, 60 సవర్ల బంగారం చోరీకి గురైనట్లు తేలింది.

ఫిర్యాదులో పనిమనిషి ఈశ్వరి, లక్ష్మీ, ఆమె డ్రైవర్ వెంకటేశన్ పై అనుమానం వ్యక్తం చేశారు ఐశ్వర్య, తాను సెయింట్ మేరీస్ రోడ్ లోని తన అపార్ట్మెంట్ కు తరుచుగా వచ్చేవారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈశ్వరి, వెంకటేశన్ ను అరెస్ట్ చేశారు.

Show comments