Dolo 650: డోలో 650 మందులు రాసినందుకు డాక్టర్లకు తాయిలాలు.. సీరియస్ గా తీసుకోవాలన్న సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DOLO-65O makers spent Rs 1,000 crore as freebies on doctors for prescribing: మైక్రో ల్యాబ్స్ ఫార్మా కంపెనీపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా సమయంలో డాక్టర్లు ఎక్కువగా డోలో -650 మెడిసిన్ సూచించారు. మైక్రోల్యాబ్స్ ఫార్మా కంపెనీ డోలో-650 ట్యాబ్లెట్లు వేసుకోవాలని డాక్టర్లకు సూచించాలని.. డాక్టర్లకు రూ.1000 కోట్ల తాయితాలు ఇచ్చింది. ఈ కేసుపై విచారించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఇది తీవ్రమైన సమస్య అని పేర్కొంది.
డోలో -650 తయారీదారులు రూ. 1000 కోట్ల విలువైన తాయిలాలను వైద్యులకు ఇచ్చారని.. ఈ ట్యాబ్లెట్లను కరోనా సమయంలో రోగులకు సూచించాలని చెప్పారని ఫెడరల్ ఆఫ్ మెడికల్ అండ్ సెల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంలో వాదించింది. పెడరేషన్ ఆఫ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరుపున సీనియర్ న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదించారు. డోలోను జ్వర నివారణ ఔషధంగా సూచించేందుకు డాక్టర్లకు ఉచితాల కింద రూ. 1000 కోట్ల పెట్టుబడి పెట్టారని సుప్రీం కోర్టుకు తెలిపారు. దీనికి బలాన్ని చేకూరుస్తూ సంజయ్ పారిఖ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) నివేదికను కోర్టుకు అందించారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్‌సభలో కాంగ్రెస్‌తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Lover suicide attempt: ప్రియురాలి బంధువుల బెదిరింపులు.. ప్రియుడి అఘాయిత్యం
ఈ స్కామ్ పై జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది నా చెవులకు సంగీతం కాదని.. నాకు కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశారని.. ఇది తీవ్రమైన సమస్య అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సదరు ఫార్మాస్యూటికల్ కంపెనీలను బాధ్యులను చేసేలా ఆదేశాలను కోరుతూ పిల్ దాఖలు చేశారు. మార్కెట్‌లో మరిన్ని యాంటీబయాటిక్‌లు అవసరం లేకపోయినా వివిధ కాంబినేషన్‌లలో ప్రమోట్ చేస్తున్నారని. డ్రగ్ ఫార్ములేషన్‌లను నియంత్రించడానికి చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్ ఉండాలని న్యాయవాది పారిఖ్ సుప్రీంకోర్టులో వాదించారు. ఈ పిల్ పై కేంద్రం వారంలోగా తన స్పందన తెలియజేయాలని.. ఈకేసు 10 రోజులకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
-
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!