Site icon NTV Telugu

Dogs On Patient Beds: ఆసుపత్రి బెడ్లపై నిద్రిస్తున్న కుక్కలు.. పట్టించుకోని సిబ్బంది..

Untitled Design

Untitled Design

మధ్య ప్రదేశ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రోగులు పడుకునే బెడ్లపై కుక్కలు హాయిగా నిద్రపోతున్నాయి.. అయినప్పటికి యాజమాన్యం పట్టించుకోకపోవడం.. గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also:Laziness Causes: సోమరితనానికి కారణమయ్యే విటమిన్లు ఇవే.. ఎలా అధిగమించాలంటే!

పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లా కిల్లాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోని రోగుల బెడ్ పై కుక్కలు నిద్రపోతున్నాయి. అక్కడున్న వైద్య సిబ్బంది పట్టించుకోకపోవవడంతో.. ఇలా అవుతుందని స్థానికులు మండిపడుతున్నారు. అయితే.. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో… మెడికల్ ఆఫీసర్ స్పందించి… క్లీనర్ ను సస్పెండ్ చేశారు. డ్యూటీలో ఉన్న నర్సు జీతంలో కోత విధించినట్లు సమాచారం. అయితే ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులను ఆదేశించామని జిల్లా కలెక్టర్ మీడియా ముందు తెలిపారు.

Exit mobile version