Site icon NTV Telugu

Power Cut: యూపీలో పవర్‌ కట్స్‌.. వైద్యులకు మొబైల్‌ టార్చిలైటే దిక్కైంది..!

Power Cut

Power Cut

ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పవర్‌ కట్‌తో వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. సుమారు గంటకుపైగా కరెంట్‌ రాలేదు. దీంతో వైద్యులు తమ మొబైల్‌ ఫోన్లలోని టార్చిలైట్ వెలుగులో రోగులకు చికిత్స అందించారు. బల్లియా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. అక్కడ భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు, రోగులు ఇబ్బంది పడ్డారు. గంటకుపైగా కరెంట్‌ రాలేదు. ఆసుపత్రిలోని జెనరేటర్‌ పని చేయలేదు. అత్యవసర లైట్లు కూడా లేవు. దీంతో చేసేదేమీ లేక డాక్టర్లు తమ మొబైల్‌ ఫోన్లలోని టార్చ్‌లైట్‌ సాయంతో… వైద్య సేవలు అందించారు. అయితే, వర్షం వల్ల కరెంటు కోతకు గురైతే, తక్షణ ఏర్పాట్లు చేసే పరిస్థితి కూడా లేదు. జనరేటర్, ఎమర్జెన్సీ లైట్లు లేకపోవడంతో.. చివరకు తమ మొబైల్ ఫోన్ల వెలుతురులోనే చికిత్స అందించారు వైద్యులు..

Read Also: YSRCP Social Media wing: సోషల్‌ మీడియా వింగ్‌పై సీఎం ఫోకస్‌.. సజ్జల తనయుడికి బాధ్యతలు..

అయితే, దీనిపై ఆస్పత్రి వర్గాల వర్షన్‌ మరోలా ఉంది.. కరెంట్‌ కట్స్‌పై స్పందించిన ఆస్పత్రి ఇన్‌ఛార్జ్ డా.రామ్.. అందరూ అనుకుంటున్నట్లు ఎక్కువ సేపు కరెంటు పోలేదన్నారు.. కేవలం 15-20 నిమిషాలు మాత్రమే కరెంటు పోయిందని.. ఆలోపే జనరేటర్ బ్యాటరీల ద్వారా కరెంట్ సప్లై జరిగిందని చెప్పుకొచ్చారు.. కాకపోతే.. బ్యాటరీలు వేరేగా ఉంచడం వల్లే, వాటిని అమర్చేందుకు టైమ్ పట్టినట్టు తెలిపారు.. మరోవైపు.. ఆస్పత్రిల్లో పవర్‌ లేకపోవడం.. మొబైల్స్‌ టార్చ్‌లైట్‌ వెలుగుల్లో వైద్యులు చికిత్సలు అందించిన దృశ్యాల్ని కొందరు తమ మొబైల్స్‌ బంధించి సోషల్‌ మీడియాకు ఎక్కించడంతో.. వైరల్‌గా మారిపోయాయి..

Exit mobile version