తెలంగాణలో న్యాయవాది వామన్‌రావు దంపతులను పట్టపగలే నడిరోడ్డుపై నరికిచంపిన ఘటన కలకలం సృష్టించింది.. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.. తాజాగా, రాజస్థాన్‌లో ఇలాంటి తరహా ఘటనే జరిగింది.. కాకపోతే అక్కడ డాక్టర్ దంపతులు.. ఇక్కడ కత్తులు వాడితే.. అక్కడ మాత్రం గన్‌తో కాల్చేశారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ భరత్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం 4.45 గంటల సమయంలో డాక్టర్ దంపతులు కారులో వెళ్తున్నారు.. అయితే, బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు.. కారుకు అడ్డంగా బైక్‌ను నిలిపివేశారు.. ఆ తర్వాత కారు దగ్గరకు వెళ్లారు.. ఈ పరిణామాన్ని ఊహించని డాక్టర్.. కారుకు అడ్డంగా బైక్‌ను ఎందుకు ఆపారంటూ కారు అద్దాలు దించి ప్రశ్నిస్తుండగా.. ఓ యువకుడు విచక్షణ రహితంగా ఇద్దరు దంపతులను విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.. వారు కారులోనే కుప్పకూలిన తర్వాత.. బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనత మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
అయితే, ఇదంతా ప్రతీకారంతో చేసినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఓ యువతి హత్య కేసులో డాక్టర్ దంపతులపై ఆరోపణలు వచ్చాయి.. ఆ యువతితో డాక్టర్‌కు ఎఫైర్ ఉందనే అనుమానాలు కూడా లేకపోలేదు.. ఈ నేపథ్యంలోనే దంపతులను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.. మొత్తంగా నడురోడ్డుపై జరిగిన ఈ జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి.