Site icon NTV Telugu

India Pakistan: గడువులోగా పాకిస్తానీలు భారత్ నుంచి వెళ్లకుంటే.. ఎలాంటి శిక్షలు పడుతాయో తెలుసా..?

India Pakistan

India Pakistan

India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ దౌత్యచర్యలు మొదలుపెట్టింది. ఈ చర్యల్లో భాగంగా ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసింది. పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేయడంతో పాటు డెడ్‌లైన్ లోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి, వెంటనే బహిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలను ఆదేశించారు. అన్ని రకాల వీసాల ఉన్నవారు ఏప్రిల్ 26 వరకు దేశం విడిచి వెళ్లాలని, వైద్య వీసాలు కలిగిన వారు 29లోగా వెళ్లాలని భారత్ ఆదేశించింది. ఈ మేరకు భారత్-పాక్ సరిహద్దు ‘‘అట్టారీ-వాఘా’’ బోర్డర్ పాక్ వెళ్లావారితో కిటకిటలాడుతోంది.

ఒక వేళ, గడువులోగా భారత్ విడిచివెళ్లకుంటే సదుర పాక్ జాతీయుడిని అరెస్ట్ చేసి విచారించి, మూడు ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా లేదా రెండింటిని శిక్షగా విధించవచ్చు. ఏప్రిల్ 04న కొత్తగా అమలులోకి వచ్చి ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 ప్రకారం.. గడువు ముగిసిపోవడం, వీసా షరతుల్ని ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను అతిక్రమించడం వంటివి చేస్తే ఈ శిక్షలు విధించవచ్చు.

‘‘ (ఏ) విదేశీయుడైనా, వీసా జారీ చేయబడిని కాలానికి మించి భారతదేశంలో ఏదైనా ప్రాంతంలో ఉన్నా లేదా సెక్షన్ 3లోని నిబంధనల్ంని ఉల్లంఘించినా, చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు లేకుండా భారత్‌లో ఉన్నా, వీసా ఉల్లంఘనలకు కారణమయ్యే ఏదైనా చర్యకు పాల్పడినా,

(బి) సెక్షన్లు 17,19 కాకుండా ఈ చట్టంలోని ఏదైనా ఇతర నిబంధనల్ని లేదా దాని కింద చేసిన ఏదైనా నియమాన్ని, ఆదేశాన్ని లేదా చట్ట ప్రకారం ఇచ్చిన ఏదైనా సూచనను, ఆదేశాన్ని ఉల్లంఘించినా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల వరకు జరిమానా లేదా రెండు శిక్షలు విధించే అవకాశం ఉంది’’ అని చట్టం చెబుతోంది.

Exit mobile version