Tamil Nadu MP Sparks Row: హిందువుగా ఉన్నంత వరకు నువ్వు శూద్రుడివే.. డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu MP Sparks Row: తమిళనాడు ఎంపీ, డీఎంకే నేత ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుమతంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. డీఎంకే నేత ఎ.రాజా హిందూ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆయన విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ ఆరోపించింది.
నీలగిరి ఎంపీ, డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి రాజా మాట్లాడుతూ.. మనుస్మృతిలో శూద్రులను అవమానించారని, సమానత్వం, విద్య, ఉద్యోగాలు, దేవాలయాల్లోకి ప్రవేశం లేకుండా చేశారని అన్నారు. “హిందువుగా ఉండే వరకు నువ్వు శూద్రుడివి. శూద్రుడిగా ఉండే వరకు వేశ్య కొడుకువి. హిందువుగా ఉండే వరకు దళితుడివి. హిందువుగా ఉండే వరకు అంటరానివాడివి” ద్రవిడర్ కజగం సమావేశంలో ఆయన అన్నారు.
Also Read
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- India-Nepal Border Dispute: భారత్‌తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్‌తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన.. మీలో ఎంత మంది వేశ్యల కుమారులుగా ఉండాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. మీలో ఎంత మంది అంటరానివారిగా ఉండాలని అనుకుంటున్నారు? అని అడిగారు. ఈ ప్రశ్నల గురించి మనం గళం విప్పితేనే అది సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడంలో కీలక అంశం అవుతుందన్నారు. ఓ వ్యక్తి క్రిస్టియన్, ముస్లిం లేదా పర్షియన్ కాకపోతే హిందువు అయి ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇంత క్రూరత్వాన్ని ఎదుర్కొనే దేశం మరేదైనా ఉందా? అని అన్నారు.
ఆయన ప్రకటన తర్వాత తమిళ రాజకీయం వేడెక్కింది. తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ వీడియోను పంచుకుంటూ ఆయన ఇలా రాసుకొచ్చారు. “తమిళనాడులో రాజకీయ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. డీఎంకే ఎంపీ ఎ.రాజా ఇతరులను సంతోషపెట్టాలనే లక్ష్యంతో మరోసారి ఒక వర్గంపై ద్వేషాన్ని వ్యాప్తి చేశారు. తమిళనాడుకు తామే గుర్రుగా ఉన్నామని భావించే ఈ రాజకీయ నేతల మనస్తత్వం చాలా దురదృష్టకరం. అని పేర్కొన్నారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. రాజా అనేక సందర్భాల్లో మహిళలను, హిందువులను అవమానించారన్నారు. హిందువుల గురించి డీఎంకే ఎంపీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన అసంబద్ధమైన మాటలపై సోషల్ మీడియా నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భారీ ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
Mini bus Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోరప్రమాదం.. లోయలో పడిన మినీబస్సు, 11 మంది మృతి
డీఎంకే నేత వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఎ.రాజా తన వైఖరిని సమర్థించుకునేందుకు ట్విట్టర్లో మరో కామెంట్ చేశారు. “శూద్రులు ఎవరు? వారు హిందువులు కాదా? మనుస్మృతిలో సమానత్వం, విద్య, ఉద్యోగాలు, ఆలయ ప్రవేశాన్ని నిరాకరించి వారిని ఎందుకు అవమానించింది. 90% హిందువుల రక్షకుడిగా ద్రావిడ ఉద్యమం వీటిని ప్రశ్నించింది. పరిష్కరించింది.” అని ట్వీట్ చేశారు.
రాజా వివాదాలకు కొత్తవారేమీ కాదు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా ఉంటారు. తమిళనాడు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంలో సీనియర్ నాయకుడు ఎ రాజా. ఆయన గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేశారు. గతంలో ఆయనపై 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు విచారణ జరిగింది.
Sorry state of political discourse in Tamil Nadu. @arivalayam MP has yet again spewed hatred against one community with the sole aim of appeasing others.
Very very unfortunate mindset of these political leaders who think they own Tamil Nadu. pic.twitter.com/UntspDKdQ3
— K.Annamalai (@annamalai_k) September 12, 2022
తాజావార్తలు
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్‌లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
-
Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
-
Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
-
India-Nepal Border Dispute: భారత్‌తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
-
Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్‌తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!