Site icon NTV Telugu

DMK Govt Erasing Hindu: కుల ధృవీకరణ పత్రాల నుంచి ‘హిందూ’ అనే పదాన్ని డీఎంకే సర్కార్ తొలగిస్తుంది..

Bjp Mla

Bjp Mla

DMK Govt Erasing Hindu: తమిళనాడు రాష్ట్రంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ప్రభుత్వం అధికారిక పత్రాల నుంచి హిందూ అనే పేరును ఉద్దేశపూర్వకంగా తుడిచి వేయడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ ఆరోపించారు. ఆన్‌లైన్ లో ఇచ్చే కుల ధృవీకరణ పత్రాలలో కుల పేర్ల ముందు ‘హిందూ’ అనే పదాన్ని ఉపయోగించడం లేదని పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం “హిందూ వ్యతిరేక ప్రవర్తన”గా అభివర్ణించింది. హిందవుల పండుగల సమయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుభాకాంక్షలు ఎందుకు చెప్పరని ప్రశ్నించింది. రాష్ట్రంలో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా సీఎం ప్రవర్తిస్తున్నారని పేర్కొంది.

Read Also: Thalliki Vandanam Scheme: “తల్లికి వందనం” స్కీమ్‌కు అర్హులు కావాలంటే ఉండాల్సిన అర్హతలు ఇవే..!

అయితే, హిందూ మతంలో కుల భేదాలు ఉన్నందున విద్య- ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లు పొందడానికి వారికి అవకాశం ఉంటుంది అని బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ తెలిపింది. అలా చేయకాకుండా, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లలో కులం పేరుతో హిందూ అనే పదాన్ని చేర్చినట్లయితే.. వారు మాత్రమే రిజర్వేషన్ పొందగలరని పేర్కొనింది. కానీ, డీఎంకే ప్రభుత్వం అందుకు విరుద్దంగా కుల ధృవీకరణ పత్రాల్లో హిందూ అనే పదాన్ని ఎందుకు తొలగిస్తుందో నాకు తెలియడం లేదన్నారు. ఇక, స్టాలిన్ సర్కార్ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకుంటున్న ఈ చర్యను విరమించుకోవాలి అని వానతి శ్రీనివాసన్ కోరారు.

Read Also: Punjab: ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్‌ అనుమానాస్పద మృతి.. కారులో మృతదేహం!

ఇక, ఏదైనా ప్రత్యేక కులం లేదా మతం ద్వారా గుర్తించబడటానికి ఇష్టపడని వ్యక్తులకు రెవెన్యూ అధికారులు ‘కులం లేదు, మతం లేదు’ సర్టిఫికెట్లు మంజూరు చేయడానికి వీలు కల్పించాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే, పిటిషనర్ కుటుంబానికి అటువంటి సర్టిఫికెట్లు జారీ చేయాలని స్థానిక తహశీల్దార్‌ను ఆదేశించడానికి నిరాకరించిన సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు వెల్లడించింది.

Exit mobile version