కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు వ్యవహారం కర్ణాటక ప్రభుత్వానికి చుట్టుకుంటోంది. కేబినెట్‌లో కీలక నేత, హోంమంత్రి పరమేశ్వర సంస్థలపై బుధవారం నుంచి ఈడీ దాడులు చేస్తోంది. అలాగే మంత్రిని కూడా ప్రశ్నించారు. ఇక మంత్రికి సంబంధించిన విద్యాసంస్థలపై దాడులు గురువారం కూడా కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: YS Jagan: విజయసాయిరెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు..!
ఈ నేపథ్యంలో గురువారం హోంమంత్రి పరమేశ్వరను డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరమేశ్వరకు సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రన్యారావు వివాహానికి హాజరైన పరమేశ్వర.. గిఫ్ట్ ఇస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పెళ్లిళ్లకు హాజరై బహుమతులు ఇవ్వడం సహజమేనన్నారు. ఇందులో భాగంగానే రన్యారావు పెళ్లికి కూడా గిఫ్ట్ ఇచ్చారని తెలిపారు. పెళ్లికి బహుమతి ఇవ్వడంలో తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay : బుల్లెట్ దిగిందా?లేదా.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
అయితే పరమేశ్వర విద్యాసంస్థ నుంచి రన్యారావుకు సంబంధించిన రూ.40 లక్షల క్రిడెట్ కార్డు బిల్లును ఎలా చెల్లించారంటూ ప్రశ్నించగా.. దీనికి తర్వాత సమాధానం చెబుతానని పరమేశ్వర చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ అంశంపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే రన్యారావు చేసిన పనికి ఏ రాజకీయ నాయకుడు మద్దతు ఇవ్వరని డీకే.శివకుమార్ అన్నారు. ఈడీ అంశాల్లో తాము జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. రన్యారావు కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: పహల్గామ్ ఉగ్ర దాడిపై మరోసారి ప్రధాని మోడీ సీరియస్ కామెంట్స్
ఇక విద్యాసంస్థలకు సంబంధించి గత ఐదేళ్ల ఆర్థిక వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. దీంతో దర్యాప్తు అధికారులకు సహకరించాలని సిబ్బందికి మంత్రి పరమేశ్వర ఆదేశించారు. దర్యాప్తు అధికారులు ఒక యూనివర్సిటీని.. మూడు విద్యాసంస్థలను సందర్శించాయి. ఈ దర్యాప్తులో రన్యారావుకు సంబంధించిన రూ.40 లక్షల క్రిడెట్ బిల్లును చెల్లించినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అధికారులు దర్యాప్తు చేస్తున్నారు
మార్చి 3న దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రన్యారావు పట్టుబడింది. ఆమె దగ్గర నుంచి రూ.12 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె జైల్లో ఉంటోంది. అయితే ఆమెపై ఛార్జ్‌షీట్ వేయకపోవడంతో బుధవారం ఆమెకు కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆమెపై విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం, 1974 చట్టం కింద అభియోగం మోపడంతో ఏడాది పాటు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
