Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
- కర్ణాటకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం
- కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
- డీకేతో ప్రమాణం చేయించిన గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో శివకుమార్‌తో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ సీఎం సతీశన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, కాంగ్రెస్ అగ్ర నేతలంతా హాజరయ్యారు.
డిప్యూటీ సీఎంగా జి.పరమేశ్వర ప్రమాణస్వీకారం చేయగా.. ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య, కె.జె.జార్జ్, కేహెచ్ మునియప్ప, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీశ్ జర్కిహోళి, కృష్ణబైరి గౌడ, యూటీ.ఖాదిర్, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్, శరణ్ ప్రకాశ్ పాటిల్ సైతం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
డీకే.శివకుమార్ బ్యాగ్రౌండ్
డీకే.శివకుమార్ 1962 మే 15న జన్మించారు. కెంపేగౌడ, గౌర అమ్మ దంపతులకు జన్మించారు. 2020 నుంచి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గతంలో 2008 నుంచి 2010 వరకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, 2014 నుంచి 2019 వరకు కర్ణాటక ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పని చేశారు. 2008 నుంచి కనకపుర శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకముందు 1989 నుంచి 2008 వరకు సాతనూరు శాసనసభ్యుడిగా ఉన్నారు. డీకే.సురేష్ అనే తమ్ముడు ఉన్నాడు. 1993లో ఉషను వివాహం చేసుకున్నారు. ఐశ్వర్య, ఆభరణ అనే ఇద్దరు కుమార్తెలు, ఆకాష్ అనే కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ కుమారుడైన అమర్త్యను వివాహం చేసుకుంది.
#WATCH | Bengaluru: Carrying a copy of the Constitution of India, DK Shivakumar takes oath as the Chief Minister of Karnataka.
(Video Source: Congress) pic.twitter.com/gYMsDu8hqL
— ANI (@ANI) June 3, 2026
#WATCH | Karnataka CM-designate DK Shivakumar greets Congress national president Mallikarjun Kharge, ahead of his swearing-in ceremony.
(Video Source: Karnataka DIPR) pic.twitter.com/wy0KoSHwmg
— ANI (@ANI) June 3, 2026
#WATCH | Karnataka CM-designate DK Shivakumar greets his predecessor Siddaramaiah, ahead of his swearing-in ceremony.
(Video Source: Karnataka DIPR) pic.twitter.com/jvZZuYjbPe
— ANI (@ANI) June 3, 2026
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!