DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
- దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు
- 10 మందికి పైగా మంత్రులు ప్రమాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar to Take Oath as Karnataka CM Today: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ నేడు కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్ ప్రాంగణంలోని గ్లాస్ హౌస్‌లో సాయంత్రం 4.05 గంటలకు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. డీకే శివకుమార్‌తో పాటు 10 మందికి పైగా మంత్రులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ జి. పరమేశ్వర డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం లోక్ భవన్లో భారీ ఏర్పాట్లు చేశారు. 4,000 మందికి పైగా కూర్చునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మొత్తం 35 మంది వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. అలాగే మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు హెచ్డి కుమారస్వామి, బసవరాజ్ బొమ్మై, జగదీష్ షెట్టర్, వీరప్ప మొయిలీలకు కూడా డీకే స్వయంగా ఆహ్వానం అందించినట్లు సమాచారం.
Also Read
ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి డీకే శివకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సీఎం పదవిని స్వీకరించే ముందు దైవ ఆశీస్సులు తీసుకోవడం కోసం ఉదయం నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్త మంత్రివర్గంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో నేడు ఉదయం 10 గంటలకు మంత్రివర్గ జాబితాను తానే స్వయంగా ప్రకటిస్తానని డీకే వెల్లడించారు. దీంతో ఎవరెవరికీ మంత్రివర్గంలో స్థానం దక్కుతుందన్న దానిపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోయే తొలి నిర్ణయాలపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.
ఇవాళ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దమవుతున్న వారి జాబితా (అంచనా):
1. యతీంద్ర సిద్ధరామయ్య
2. డా. జి. పరమేశ్వర
3. యు.టి. ఖాదర్
4. కె.జె. జార్జ్
5. కృష్ణ బైరే గౌడ
6. ఎం.బి. పాటిల్
7. ప్రియాంక్ ఖర్గే
8. సతీష్ జార్కిహోళి
9. రామలింగారెడ్డి
10. కె.హెచ్. మునియప్ప
11. దినేష్ గుండూ రావు
తాజావార్తలు
-
DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
-
Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
-
Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. అప్పులు అస్సలు ఇవ్వొద్దు, తీసుకోవద్దు సుమీ!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!