DK Shivakumar: మల్లికార్జున ఖర్గేతో డీకే శివకుమార్ భేటీ.. కర్ణాటక సీఎం మార్పుపై ఊహగానాలు
- కర్ణాటక సీఎం పదవి స్వీకరిస్తారంటూ గత కొంత కాలంగా ప్రచారం..
- డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపిన వీరప్ప మొయిలీ..
- మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్..
- ప్రోటోకాల్‌కు సంబంధించిన అంశం కాబట్టి ఖర్గేను కలిశా: డీకే శివకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం పదవి స్వీకరిస్తారంటూ గత కొంత కాలంగా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సమావేశం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఊహగానాలు వెల్లువెత్తాయి. అయితే, ఖర్గేతో తన సమావేశం ప్రోటోకాల్‌కు సంబంధించిన అంశమని డీకే తెలిపారు. ఆయన మా పార్టీ అధ్యక్షుడు.. ప్రోటోకాల్ ప్రకారం అతడ్ని నేను రిసీవ్ చేసుకోవాల్సి ఉందన్నారు. అందుకే ఖర్గేను కలిశాను.. బెంగళూరులో పార్టీ కొత్త ఆఫీసు శంకుస్థాపన కోసం ఆయనను ఆహ్వానించాం.. ఈ సందర్భంగా ఆయనతో చాలా విషయాలపై చర్చించాను అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివ కుమార్ చెప్పుకొచ్చారు.
Read Also: Bihar: అసెంబ్లీలో తేజస్వీ యాదవ్-నితీష్ కుమార్ మధ్య మాటల యుద్ధం.. హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు
Also Read
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ఇక, కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు స్వీకరిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే సీఎం కావడం ఖాయం.. దీన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. అతడ్ని సీఎం పదవి చేపట్టడం అనేది కాలపరిమితితో కూడుకున్నది.. అయితే అది కచ్చితంగా జరుగుతుందని చెప్పాడు. కాగా, వీరప్ప మొయిల్ వ్యాఖ్యలపై డీకే శివకుమార్ రియాక్ట్ అయ్యారు. ఈ ప్రకటనలు ఆయన వ్యక్తిగతం.. ఖర్గే నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ.. వీరప్ప చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయాయి. అలాగే, వీరప్ప వ్యాఖ్యలపై స్పందించిన కేఎన్ రాజన్న.. ఇది కేవలం అతడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.. దీనిపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!