DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..

  • ప్రధాని మోదీ విమర్శలకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కౌంటర్
  • దేశంలో ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ కీలక కృషి చేసిందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ కృషి వల్లే మోదీ ప్రధాని అయ్యారంటూ డీకే వ్యాఖ్యలు
Modi Dk Shivakumar

Modi Dk Shivakumar

DK Shivakumar: ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై చేసిన విమర్శలకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం బలపడటంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని, మోడీ ప్రధాని కావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ దేశ నాయకత్వానికి చేసిన కృషినే కారణమని అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన డీకే.. కాంగ్రెస్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని, కాంగ్రెస్ లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఈ స్థాయిలో ఉండేది కాదని అన్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అందించిందని అన్నారు.

దీనికి ముందు గురువారం కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని రాజకీయంగా ముందుకు తీసుకురావడానికి ఎన్నోసార్లు ప్రయత్నించిందని, ఆ ప్రయత్నాలు పదే పదే విఫలమయ్యాయని అన్నారు. శ్రీహరికోట నుంచి ఏడాదికి భారత్ ప్రయోగించే రాకెట్ల సంఖ్య కన్నా కాంగ్రెస్ రాహుల్ గాంధీని లాంచ్ చేసిన విఫల ప్రయత్నాలే ఎక్కువ అంటూ ఎద్దేవా చేశారు. ప్రపంచం కొత్త అంతర్జాతీయ వ్యవస్థ కోసం చూస్తుంటే, కొందరు భారత్‌లో గందరగోళాన్ని కోరుకుంటున్నారని ఆరోపించారు.