DK Shivakumar: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజాదరణకు భయపడి ఆయనపై బీజేపీ నిందలు వేస్తోందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. సిద్ధరామయ్య పవర్‌ఫుల్ మాస్ లీడర్, ఆయనతో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన బలమైన ప్రజానాయకులందర్ని అంతమొందించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బెంగళూర్‌లో శుక్రవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: CM Revanth Reddy : మూసీ అణుబాంబు కంటే ప్రమాదంగా మారబోతోంది
బీజేపీని విమర్శించే వారిని తొలగించాలనే వ్యూహంపై సీఎం సిద్ధరామయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఒక రోజు తర్వాత డీకే శివకుమార్ నుంచి తాజా కామెంట్స్ వచ్చాయి. తనను అప్రతిష్టపాలు చేయడం ద్వారా కాంగ్రెస్‌ని కూల్చివేయాలని బీజేపీ చూస్తోందని సిద్ధరామయ్య గురువారం ఆరోపించారు. నరేంద్రమోడీ, అమిత్ షాలను విమర్శిస్తున్నా కాబట్టి వారు సిద్ధరామయ్యని అంతమొందించాలనుకుంటున్నారు. సిద్ధరామయ్యను తుదముట్టిస్తే కర్ణాటకలో కాంగ్రెస్ అంతమవుతుందని వారి ఆలోచన అని సీఎం చెప్పారు. ఉపఎన్నికలు జరగబోతున్న సండూర్ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం బళ్లారిలో జరిగిన ప్రచార సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. బీజేపీ తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతోందని విమర్శించారు.