Site icon NTV Telugu

Raja Singh: రోడ్డుపై నమాజ్ చేస్తే, హనుమాన్ చాలీసా.. రాజా సింగ్ సంచలనం..

Raja Singh

Raja Singh

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ట్వీట్ చేశారు. రోడ్లపై నమాజ్ చేయడాని ప్రజల్ని అనుమతించొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ని కోరారు. రోడ్లపై నమాజ్ చేయడానికి ప్రజల్ని అనుమతిస్తే, అది హనుమాన్ చాలీసా చదివేంచేలా ప్రోత్సహిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మన వీధుల్లో ప్రజల దైనందిత జీవితానికి అంతరాయం కలిగించే, మతపరమైన ఆచార స్థలాలుగా మార్చడానికి మేము అనుమతించమని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

Read Also: Karnataka: 20 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ విక్రమ్ గౌడ్ ఎన్‌కౌంటర్

ఇలాంటి చర్యలు ఇది సాధారణ ప్రజలకు అనవసరమైన ఆటంకాలను, అవాంతరాలను మాత్రమే సృష్టిస్తుందని చెప్పారు. ఏ సమూహం కూడా ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా, రోడ్లు అందరికీ స్పష్టంగా, శాంతియుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. గతంలో పలు రాష్ట్రాల్లో రోడ్లపై నమాజ్ చేయడం వివాదాలకు దారి తీసింది. దీనికి ప్రతిచర్యగా మరో వర్గం రోడ్లపైకి వచ్చి హనుమాన్ చాలీసాను పఠించారు.

Exit mobile version