NTV Telugu Site icon

Sanjauli Mosque: సంజౌలీ మసీదులోకి ఏఐఎంఐఎం అధినేత ప్రవేశం.. కొనసాగుతున్న ఉద్రిక్తత..!

Simla Maszid

Simla Maszid

Sanjauli Mosque: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో గల సంజౌలీ మసీదు మరోసారి తీవ్ర వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. మసీదులోకి ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత ప్రవేశించిన తర్వాత ఈ అంశంపై మళ్లీ తీవ్ర దుమారం చెలరేగింది. షోయబ్ జమై మసీదుకు వెళ్లి వీడియో తీసి దానిపై న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. తక్కువ ముస్లీంలు ఉండటంతో మద్దతు ఇచ్చే వ్యవస్థ లేకపోవడం వల్ల మసీదు కమిటీ రాజీ పడవలసి వచ్చిందని అన్నారు. హిమాచల్‌ మాజీ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి విక్రమాదిత్య కూడా జామాయి వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని షోయబ్ జమై ఆరోపించారు.

Read Also: Devara Jatharaa: టైగర్ వేటకు సమయం ఆసన్నమైంది.. మరికొన్ని గంటల్లో ఎరుపెక్కనున్న థియేటర్లు!

కాగా, సంజౌలి మసీదును ఏఐఎంఐఎం ఢిల్లీ రాష్ట్ర అధినేత సోయబ్ జమై సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో న్యాయం అందరికీ సమానం, మసీదు చట్టబద్ధమైనదా లేదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయిస్తుందని చెప్పారు. మసీదుతో సమానమైన అంతస్తులు ఉన్న భవనాలను చూపుతూ.. ఈ మసీదు చట్టవిరుద్ధమైతే, అనేక ఇతర నిర్మాణాలు కూడా చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఈ ఘటనపై మేము కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం.. నాలుగున్నర అంతస్తులకు పైగా ఉన్న ఇతర భవనాలు ఎందుకు కూల్చి వేయకూడదో అడుగుతామన్నారు.

Read Also: Jethwani case: రిమాండ్‌ను సవాల్‌ చేసిన విద్యాసాగర్‌.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

అయితే, మసీదు కమిటీ చట్టవిరుద్ధమైన భాగాన్ని స్వయంగా కూల్చివేయాలనే ప్రతిపాదనను షోయబ్ జమై తీవ్రంగా ఖండించారు. ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉండటంతో వారికి మద్దతు దొరకడం లేదన్నారు. కొన్ని శక్తులు ఇక్కడ తమ స్వరం పెంచుతున్నాయి.. దేశంలోని ముస్లింలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. సంజౌలిలోని ముస్లీంలకు ఆదుకోవాల్సిన బాధ్యత మన ఢిల్లీ వాసులపై ఉందన్నారు. తాము సంజౌలీ మసీదుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాం.. ఇప్పుడు కేవలం మౌలానాతో మాట్లాడాం.. ఈ సంఘటనపై హైకోర్టులో పిల్ దాఖలు చేస్తామని విసయం గురించి వక్ఫ్ బోర్డు సభ్యులతో కూడా మాట్లాడుతున్నామని ఏఐఎంఐఎం ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు షోయబ్ జమై అన్నారు.