NTV Telugu Site icon

Disha Salian: “దిశా సాలియన్‌”పై గ్యాంగ్ రేప్.. “ఆదిత్య ఠాక్రే”పై విచారణ కోరుతూ తండ్రి పిటిషన్..

Disha Salian

Disha Salian

Disha Salian: దివంగత బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, అతడి మాజీ మేనేజర్‌గా పని చేసిన దిశా సాలియన్ మరణం మరోసారి తెర పైకి వచ్చాయి. దిశా సాలియన్ ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తు నుంచి అనుమానాస్పదంగా పడి చనిపోయింది. ఇది జరిగిన ఆరు రోజులకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దిశా సాలియన్ మరణించి 5 ఏళ్ల తర్వాత ఆమె తండ్రి శివసేన(ఠాక్రే) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. అయితే, దీనిపై ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం తన పరువు తీయడానికి కోర్టులో ఈ కేసును వేశారని ఆరోపించారు.

సతీష్ సాలియన్ న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ జూన్ 8, 2020న సబర్బన్ మలాడ్‌లోని ఒక ఎత్తైన భవనం యొక్క 14వ అంతస్తు నుండి పడి దిషా మరణించాడు. ఆ తర్వాత పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR) కేసును నమోదు చేశారు. ఆరు రోజుల తర్వాత, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన బాంద్రా ఫ్లాట్‌లో చనిపోయాడు. పోలీసులు మొదట దీనిని ఆత్మహత్య కేసు అని చెప్పారు. ఆ తర్వాత దీనిని సీబీఐకి అప్పగించారు.

Read Also: Meerut Murder: ‘‘నాన్న డ్రమ్‌లో ఉన్నాడు’’.. తండ్రి హత్య గురించి పక్కింటి వాళ్లకు చెప్పిన పాప..

2020లో, సతీష్ సాలియన్ తన కుమార్తె మరణంలో ఎవరిపైనా అనుమానాలు లేవని, దర్యాప్తుతో పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, ఇటీవల దిశా తండ్రి సతీష్ సాలియన్ తన పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు. జూన్ 08, 2020లో దిశా తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించిందని, దానికి ఆదిత్య ఠాక్రే, సూరజ్ పంచోలి, డినో మోరియా తదితరులు హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనాలను ఉటంకిస్తూ.. దిశాపై సామూహిక అత్యాచారం జరిగిందని, బలవంతంగా నిర్బంధించడం, క్రూరమైన లైంగిక దాడికి గురైందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దిశా ఎత్తైన భవనం నుంచి పడినప్పటికీ, ఆమె శరీరంపై ఒక్క బలమైన గాయం కూడా లేదని, సంఘటనా స్థలంలో రక్తం లేదని పిటిషన్‌లో ఆరోపించారు.

అప్పటి రాజకీయ నాయకుల ఒత్తిడితో, నిందితులను రక్షించడానికి అధికారికి శవపరీక్ష నివేదికను మార్చారని పిటిషన్‌లో ఆరోపించారు. ఫోరెన్సిక్ ఆధారాలు ధ్వంసం చేశారని, సీసీటీవీ ఫుటేజీని తారుమారు చేశారని దిశ తండ్రి ఆరోపించారు. సరైన పోస్ట్‌మార్టం విశ్లేషణ లేకుండా త్వరగా దహన సంస్కారాలు జరిగాయని పిటిషన్ ఆరోపించింది. ఇదే కాకుండా, దిశ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్టుమార్టం టైమ్‌ని పిటిషన్‌లో ఎత్తిచూపారు. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌కి అదే రోజు పోస్టుమార్టం నిర్వహిస్తే, దిశా పోస్టుమార్టానికి 50 గంటలకు పైగా ఆలస్యం చేశారని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ఆదిత్య ఠాక్రేని రక్షించడానికి సాక్ష్యాలు నాశనం చేసినట్లు ఆరోపించారు.