NTV Telugu Site icon

Karnataka: లోపం శరీరానికే మెదడుకు కాదని నిరూపించిన వికలాంగులు.. పెళ్లితో ఒకటైయ్యారు

Marriage

Marriage

Karnataka: అన్నీ సక్రమంగా ఉన్నా మనలో చాలా మంది అవకాశం రావట్లేదని నిరోద్యోగులగా ఉన్నారు. అయితే పుట్టుకతోనే మూగ, చెవుడు ఉన్న.. ఆ లోపాన్ని లెక్క చేయకుండా లోపం శరీరానికే కానీ మెదడుకు కాదు అని నిరూపించి అందరూ ఆశ్చర్యపోయేలా ప్రముఖ కంపెనీలలో ఉద్యోగం చేస్తున్నారు ఓ యువతీ యువకుడు. కాగా ఆ యువతీ యువకుడు తాజాగా పెళ్లితో ఒకటైయ్యారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రము లోని సకలేష్‌పూర్ తాలూకా లోని బల్లుపేట సమీపం లోని బనవాసే గ్రామానికి చెందిన జాహ్నవి, రాంనగర్‌ జిల్లా లోని మాగాడి తాలూకా లోని కల్యా గ్రామానికి చెందిన నవీన్‌ పుట్టుకతోనే మూగ చెవుడు కలిగి ఉన్నారు.

Read also:BSP Chief Mayavati: బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ

అయితే ఆ లోపం కారణంగా వాళ్ళు వెనకడుగు వెయ్యలేదు. ఆ లోపాన్ని అధిగమించి ముందుకు వెళ్లారు. జాహ్నవి డిప్లొమా చేసి బెంగళూరు లోని అమెజాన్ కంపెనీలో ఉధ్యోగం చేస్తుంది. కాగా డిగ్రీ పూర్తి చేసిన నవీన్ బెంగళూరు లోని టీవీఎస్ కంపెనీలో ఉధ్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లయ్యాక ఇద్దరూ టీవీఎస్ కంపెనీలో ఉద్యోగం చేయాలనుకోవడంతో తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. దీనితో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి స్థానికులు, బంధువులతో పాటుగా స్థానిక MLA కూడా హాజరు అయ్యారు. మంత్రాలు పఠిస్తూ సప్తపది తొక్కే వివాహ సంప్రదాయం అయినప్పటికీ.. మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా చేసిన వేడుకలో వీళ్ళ పెళ్లి మౌనంగా జరిగింది.

Show comments