Raebareli: కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్.. ఎవరు ఇతను..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raebareli: కాంగ్రెస్‌కి కంచుకోటలుగా ఉన్న రాయ్‌బరేలీ, అమేథీకి అభ్యర్థులను ఇంకా ఆ పార్టీ ప్రకటించలేదు. రేపటితో ఈ రెండు స్థానాలకు నామినేషన్ ప్రక్రియ పూర్తవుతోంది. ఈ రాత్రి వరకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, సోనియాగాంధీ ఇన్నాళ్లుగా పోటీ చేసిన రాయ్‌బరేలీలో బీజేపీ తన అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్‌ని నిలబెట్టింది. సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడంతో రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ తరుపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రియాంకాగాంధీ ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Read Also: Layoffs: ఒక్క ఏప్రిల్ నెలలోనే 20,000 మంది ఉద్యోగుల్ని తొలగించిన టెక్ కంపెనీలు..
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
ఎవరు ఈ దినేష్ ప్రతాప్ సింగ్:
దినేష్ ప్రతాప్ సింగ్ బ్లాక్ లీడర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం యోగి సర్కార్‌లో మినిస్టర్‌గా ఉన్నారు. 2004లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2007లో బీఎస్పీ టికెట్‌పై తిలోయ్ నియోజకవర్గం నుంచి ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. 2010 నుంచి 2016 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. 2016 నుంచి 2022 వరకు మరోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్నారు. 2022లో మూడో సారి గెలిచి యోగి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు.
2018లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన దినేష్ ప్రతాప్ సింగ్‌కు ఆ పార్టీ రాయ్‌బరేలీ నుంచి టికెట్ ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గట్టి పోటీ ఇచ్చినా గెలవలేకపోయారు. సోనియా గాంధీకి 55.80 శాతం ఓట్లు రాగా, దినేష్ సింగ్‌కు 38.36 శాతం ఓట్లు వచ్చాయి. సోనియా గాంధీ 2004 నుంచి 2024 వరకు రాయ్‌బరేలీ నుంచి నిరంతరం ఎంపీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!