Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి

  • ప్రముఖ డ్యాన్సర్‌ డింపుల్ చౌదరితో అనుచిత ప్రవర్తన
  • స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Dancer1

Dancer1

దేనికైనా కొన్ని హద్దులుంటాయి. చనువు ఇచ్చింది కదా? అని హద్దలు దాటితే మాత్రం పరిస్థితులు తల్లకిందులవుతాయి. ఇదంతా దేనికోసమంటారా? స్టేజ్‌పై ప్రముఖ నర్తకి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండగా ఓ కీచకుడు మధ్యలో దూరి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటనతో అవాక్కైన డ్యాన్సర్.. వెంటనే తేరుకుని చెంపచెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలోని సదాబాద్ ప్రాంతంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హర్యానాకు చెందిన ప్రముఖ డ్యాన్సర్ డింపుల్ చౌదరిని పిలిపించారు. బర్త్‌డే వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. స్టేజ్‌పై డింపుల్ చౌదరి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ గ్రామస్తులను, ప్రేక్షకులను అలరిస్తోంది. ఇంతలో ఎర్ర టోపీ పెట్టుకున్న ఓ యువకుడు దగ్గరకు వచ్చి డింపుల్ చౌదరి నడుంపై చేయి వేసి అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే కీచకుడి చెంపచెళ్లుమనిపించింది. వెంటనే వ్యాఖ్యాత చేతిలోంచి మైక్ తీసుకుని వార్నింగ్ ఇచ్చి డ్యాన్స్ చేయనంటూ స్టేజ్ దిగేసి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను డింపుల్ చౌదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

×
×
Ad

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ఎర్ర టోపీ పెట్టుకున్న కుర్రాడు మొదటి నుంచి వేదికపైనే నిరంతరం తిరుగుతూ ఉన్నాడని.. నర్తకి నడుము తాకేందుకు ప్రయత్నిస్తున్నాడని.. చేయి వేయగానే డింపుల్ చౌదరి చెంపదెబ్బ కొట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుతం వీడియో వైరల్ కావడంతో డ్యాన్సర్ల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బహిరంగ కార్యక్రమాల్లో ప్రదర్శనకారులకు భద్రత కల్పించాలని డిమాండ్ వస్తోంది.