Site icon NTV Telugu

Digvijaya Singh: ‘‘ఉమర్ ఖలీద్ అమాయకుడు’’.. దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..

Digvijaya Singh

Digvijaya Singh

Digvijaya Singh: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్‌ గురించి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఉమర్ ఖలీద్ ‘‘నిర్దోషి, అమాయకుడు’’ అంటూ ఆయన అనడం కొత్త వివాదాన్ని రేపింది. జాతీయ భద్రతలకు ఆందోళన కలిగించే తీవ్రమైన కేసుల్లో ఉన్న వ్యక్తి పట్ల దిగ్విజయ్ సింగ్ సానుభూతి చూపిస్తున్నారంటూ బీజేపీ ఎదురుదాడి చేసింది. దిగ్విజయ్ సింగ్ తన సోషల్ మీడియా పోస్టులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖలీద్ ఐదేళ్లుగా నిర్బంధంలో ఉన్నప్పటికీ న్యాయం దక్కడం లేదని ఆయన అన్నారు.

‘‘ఉమర్ ఖలీద్ చరిత్రలో డాక్టరేట్ పొందారు. ఆయన ఉన్నత విద్యావంతుడు, సున్నితమైన వ్యక్తి. ఆయనపై ఎలాంటి నేరాలు ఆరోపించబడినా దర్యాప్తు చేసి పరిష్కరించాలి. ఆయన ఐదున్నర సంవత్సరాలుగా జైలులో ఉన్నారు. ఆయనపై ఎటువంటి అభియోగాలు నిరూపించబడలేదు. సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ బెయిల్ ఒక హక్కు అని చెబుతుంది; జైలు ఒక మినహాయింపు. కానీ ఇక్కడ, ఆయనకు ఈ హక్కు ఎక్కడ మంజూరు చేయబడింది? ఆయన విచారణలు కొనసాగుతున్నప్పుడు, న్యాయమూర్తులు నిరంతరం తేదీలను వాయిదా వేస్తారు. తేదీ నిన్నటిది, కానీ అది వాయిదా పడింది. నేడు అధికారంలో ఉన్నవారు అలాంటి నిర్ణయాలను ప్రభావితం చేస్తారు. దీని కారణంగా, ఆయనకు అర్హత ఉన్న వాటిని కూడా పొందడం లేదు.’’ అని అన్నారు.

Read Also: England Cricket Contracts 2025: క్రికెట్ బోర్డ్ సంచలన నిర్ణయం.. ఆ ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులు రద్దు

జేఎన్‌యూ స్టూడెంట్ అయిన ఉమర్ ఖలీద్ ను UAPA చట్టం కింద అరెస్ట్ చేశారు. 2020లో జరిగి ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఈ హింసలో 50 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అశాంతిని రెచ్చగొట్టడానికి, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన కుట్రలో భాగమని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.

దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ మాట్లాడుతూ.. ఆయనకు తీవ్రవాదులతో సానుభూతి చూపే చరిత్ర ఉందని ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్ భారత్‌లో జన్మించి ఉండకపోవచ్చనే అనుమానం ప్రారంభమైందని, కొన్నిసార్లు ఉగ్రవాది ఒసామాను, ఒసామా జీ గా సంబోధిస్తారని, అప్జల్ గురును , అప్జల్ గురు జీగా పిలుస్తారని అన్నారు. వీలైనంత త్వరగా దిగ్విజయ్ సింగ్ పాకిస్తాన్‌లో ఒక శిబిరం ఏర్పాటు చేయాలని అన్నారు.

Exit mobile version