Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి యావత్ దేశాన్ని షాక్‌కి గురి చేసింది. అయితే, సకాలంలో ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించిన ఆటో డ్రైవర్ ఇప్పుడు హీరోగా మారారు. ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా హుటాహుటీన సైఫ్‌ని ఆస్పత్రికి తరలించడంలో సాయం చేశాడు. ఈ సంఘటన గురించి ఆయన వెల్లడించారు. సైఫ్ తన ఆటో ఎక్కిన తర్వాత ‘‘ఆస్పత్రికి ఎంత సమయం పడుతుంది..?’’ అని అడిగారని చెప్పాడు. అది అత్యవసర పరిస్థితి, నా ఆటోలోకి ఎక్కుతున్న ఈ ప్రయాణీకుడు ఎవరు అని నేను కూడా భయపడ్డానని, నేను ఇబ్బందుల్లో పడతానేమో అని అనుకున్నాని డ్రైవర్ రాణా చెప్పారు.
‘‘నేను వెళ్తున్న సమయంలో అకాస్మత్తుగా గేట్ నుంచి ఒక పెద్ద శబ్ధం వినించింది. ప్రధాన గేటు దగ్గర ఒక మహిళ ఆటో ఆపు అని అరుస్తోంది. మొదట్లో అతను సైఫ్ అలీ ఖాన్ అని తెలియదు. సాధారణ దాడి కేసుగానే భావించాను’’ అని రాణా చెప్పారు. ‘‘ అతను (సైఫ్ అలీ ఖాన్) స్వయంగా నా వైపు నడిచి ఆటోలో కూర్చున్నాడు. అతను గాయపడిన స్థితిలో ఉన్నాడు. ఒక చిన్న పిల్లవాడు మరియు అతనితో మరొక వ్యక్తి ఉన్నాడు. నా ఆటోలో కూర్చున్న వెంటనే, సైఫ్ అలీ ఖాన్ నన్ను కిట్నా టైమ్ లగేగా (ఆసుపత్రికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది) అని అడిగాడు. మేము ఎనిమిది నుండి పది నిమిషాల్లో చేరుకున్నాము’’ అని అన్నారు.
‘‘సైఫ్ అలీ ఖాన్ మెడ, వీపు నుంచి రక్తస్రావం అవుతోంది. అతడి తెల్ల కుర్తా ఎర్రగా మారింది. చాలా రక్తం పోయింది. నేను వారి వద్ద నుంచి ఛార్జీ కూడా తీసుకోలేదు. ఆ సమయంలో నేను అతడికి సాయం చేయగలిగినందుకు నాకు సంతోషంగా ఉంది’’ అని ఆటో డ్రైవర్ రాణా చెప్పారు. ఆస్పత్రికి వెళ్లే క్రమంలో హోలీ ఫ్యామిలీకి లేదా లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలా అని ప్రశ్నించానని, వారు లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత మాత్రమే ఆయన సైఫ్ అలీ ఖాన్ అని తెలిసినట్లు చెప్పారు.