CJP Talks: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు.. కేంద్రం ముందు 3 డిమాండ్లు..

  • కేంద్రం-సీజేపీ మధ్య 2 గంటల పాటు చర్చలు..
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఆందోళన విరమిస్తాం..
  • కేంద్రం ముందు సీజేపీ 3 ప్రధాన డిమాండ్లు..
Cjp

Cjp

CJP Talks: నీట్ పేపర్ లీక్ వ్యవహారం, సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఈ రోజు కేంద్రం-సీజేపీ ప్రతినిధుల మధ్య చర్చలు మొదలయ్యాయి. తటస్థ వేదిక కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో చర్చలు జరిగాయి. దాదాపుగా రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. సీజేపీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకా హాజరుకాగా, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ చర్చల్లో పాల్గొన్నారు. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది.

ధర్మేంద్ర ప్రధాన్ తప్పకుండా రాజీనామా చేయడంతో పాటు, నిరసనకారులపై పెట్టిన కేసుల్ని విత్ డ్రా చేసుకోవాలని, ఆత్మహత్మ చేసుకున్న విద్యార్థులకు రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలనే డిమాండ్లను కేంద్రం ముందు ఉంచింది. అయితే, ఇందులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా రెండు డిమాండ్లపై కేంద్ర సానుకూలంగా ఉంది. కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగేది లేదని సీజేపీ స్పష్టం చేసింది.  ఆయన రాజీనామాపై కేంద్రం రేపటి వరకు సమయం కోరింది. శనివారం మరోసారి కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు జరగనున్నాయి.