Site icon NTV Telugu

Bangladesh: షేక్ హసీనా ప్రసంగం.. భారత్‌పై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం..

Hasina Yunus

Hasina Yunus

Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో చేసిన ప్రసంగం బంగ్లాదేశ్‌లో ప్రకంపనలకు కారణమైంది. బంగ్లాదేశ్‌ శాంతి, భద్రత, ప్రజాస్వామ్య పరివర్తనకు ఆమె వ్యాఖ్యలు ముప్పు కలిగిస్తున్నాయని మహ్మద్ యూనస్ తాతాల్కిక ప్రభుత్వం ఆరోపించింది. హసీనాను ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రసంగించడానికి అనుమతించడం ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేసిందని బంగ్లాదేశ్ ప్రభుత్వం శనివారం తెలిపింది.

Read Also: India vs New Zealand 3rd T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. అప్పుడే రెండు వికెట్లు డౌన్!

బంగ్లాదేశ్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, ‘‘మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ దోషిగా నిర్ధారించిబడిన హసీనా జనవరి 23న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని తొలగించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను పక్కదారి పట్టించడానికి తన పార్టీ విశ్వాసపాత్రులను మరియు సాధారణ ప్రజలను ఉగ్రవాద చర్యలకు ప్రేరేపించారు’’ అని ప్రభుత్వం పేర్కొంది.

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ఉందని, దీని ప్రకారం పదేపదే ఆమెను అప్పగించాలని అభ్యర్థించినప్పటికీ హసీనాను అప్పగించకపోవడం పట్ల బంగ్లాదేశ్ తీవ్రంగా బాధపడుతోందని ప్రకటన పేర్కొంది. దీనికి బదులుగా ఆమె భారత గడ్డపై నుంచి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడానికి అనుమతిస్తున్నారని, ఇది బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య పరివర్తన, శాంతి భద్రతలను స్పష్టంగా ప్రమాదంలో పడేస్తుందని ఆరోపించింది. హసీనాను ప్రసంగాన్ని ద్వేషపూరిత ప్రసంగంగా అభివర్ణిస్తూ.. ఇది రెండు దేశాల సంబంధాల నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version