ప్రయాణికులకు ఇండిగో సృష్టించిన సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలకు సిద్ధపడింది. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌తో సమావేశం తర్వాత చర్యలకు పూనుకుంది. ఇండిగో సంక్షోభానికి కారణమైన నలుగురు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్లను తొలగించింది. సిబ్బంది కొరతకు ఈ నలుగురే కారణంగా భావించి పక్కన పెట్టింది. అయితే డీజీసీఏ కచ్చితమైన కారణం చెప్పకపోయినా.. ఆ కారణంతోనే తొలగించినట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌తో సమావేశం అయ్యారు. ఇండిగో సంక్షోభం, కార్యకలాపాల పునరుద్ధరణ, నియామక ప్రక్రియపై డీజీసీఏ చర్చించింది. ఈ సందర్భంగా పీటర్ ఎల్బర్స్ క్షమాపణ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా వైరల్ అయింది. తాజాగా కఠిన చర్యలకు దిగిన డీజీసీఏం.. నలుగురు ఇండిగో ఫ్లైట్స్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్లను తొలగించింది.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
గత వారం నుంచి దేశ వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం నెలకొంది. ఎన్నడూ లేని విధంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిండి తిప్పులు లేకుండా ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కొనసాగించారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడు సేవలు పునరుద్ధరణ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Australia: స్కైడైవర్‌లో అపశృతి.. విమానం తోకకు చిక్కుకున్న పారాచూట్.. వీడియో వైరల్
