శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రశంసలతో ముంచెత్తారు. శాసన మండలిలో ఉద్ధవ్ థాక్రే పదవీకాలం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ఉద్ధవ్‌ను ప్రశంసించారు. ‘‘ఆయన స్వభావంలో రాజకీయాలు తక్కువ.. కళాకారుడి మనసు ఎక్కువ’’ అని అన్నారు. మహారాష్ట్ర సంస్కృతిని తన కెమెరాలో బంధించిన ఛాయాగ్రాహకుడిగా థాక్రేను ఫడ్నవిస్ అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: Harshil Kalia: విషాదం.. కారు ప్రమాదంలో నటి హర్షిల్ కాలియా కన్నుమూత
ఈ సందర్భంగా 2019లో తలెత్తిన విభేదాల గురించి ఫడ్నవిస్ ప్రస్తావించారు. ‘‘రాజకీయాల్లో విభేదాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం కలిసి ఉంటాం. కొన్నిసార్లు విడిగా ఉంటాం. కానీ వీటన్నిటికీ అతీతంగా సహయాత్రికులమనే గాఢమైన బంధం ఉంది. కొన్నిసార్లు ఉద్ధవ్ నిర్ణయాలు విభిన్న పరిస్థితులను సృష్టిస్తాయి. ఈ గుణాన్ని బాలాసాహెబ్ నుంచి వారసత్వంగా పొందారు. ఒకసారి ఏదైనా నిర్ణయిస్తే అది నిర్ణయంగానే మిగిలిపోతుంది.’’ అని చెప్పారు. చివరగా ‘‘మనం మళ్లీ కలుద్దాం’’ అని అర్థం వచ్చేలా ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
