Harshil Kalia: విషాదం.. కారు ప్రమాదంలో నటి హర్షిల్ కాలియా కన్నుమూత
- జైపూర్‌లో విషాదం
- కారు ప్రమాదంలో నటి హర్షిల్ కాలియా కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి, మోడల్ హర్షిల్ కాలియా (30) హఠాన్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ముంచుకు రావడంతో చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. కారు డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
రాజస్థాన్‌కు చెందిన హర్షిల్ కాలియా జైపూర్‌లో సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కారు డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీలు కొట్టింది. దీంతో స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. వాహనం అతివేగంతో వెళ్తోందా లేక మరో వాహనం దానిని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక పోస్ట్‌మార్టం ద్వారా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
హర్షిల్ కాలియా ‘క్రైమ్ నెక్స్ట్ డోర్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఒక న్యూస్ ఛానెల్‌కు యాంకర్‌గా కూడా వ్యవహరించి. పలు రాజస్థానీ పాటల్లో కథానాయికగా నటించింది. ఇటీవల మోడలింగ్‌లో కూడా కెరీర్‌ను సాగిస్తోంది. ఇక కాలియా తండ్రి కూడా పాత్రికేయ రంగంతో సంబంధం కలిగి ఉన్నారు. ఒక ప్రైవేట్ వార్తాపత్రికలో పనిచేస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!