NTV Telugu Site icon

Harsh Goenka: సంపన్నులు ఓటేయరు.. ప్రజాస్వామ్యం వేచి చూడాల్సిందే..

Harsha

Harsha

Harsh Goenka: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఎన్నో విషయాలను నెటిజన్స్ తో పంచుకుంటారు. ఆయన చేసిన పోస్టులు, వీడియోలు అందరికి స్ఫూర్తిని కలిగించడంతో పాటు ఆలోచింపజేస్తాయి. అయితే, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మలబార్‌ హిల్‌లో సంపన్నులు ఓటేయరని గోయెంకా వ్యంగ్యాస్త్రాలు సంధింస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టులో.. మలబార్‌ హిల్‌లో సంపన్నులు పోలింగ్‌ కేంద్రానికి మెర్సిడెస్‌ బెంజ్‌లో వెళ్లాలా? లేదంటే బీఎండబ్ల్యూ కారులో వెళ్లాలా అని చర్చిస్తూ కూర్చుంటారని ఎద్దేవా చేశారు.

Read Also: Retirement Age: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచారంటు వస్తున్న వార్తల్లో నిజమెంత?

ఇక, మనీష్‌ మల్హోత్రా అవుట్‌ఫిట్‌కు ఎలాంటి కళ్లజోడు పెట్టుకుంటే సరిపోతుందని తెగ కష్టపడుతుంటారు.. అంత వరకు ప్రజాస్వామ్యం వేచి చూడాల్సిందేనని హర్ష గోయెంకా అసహనం వ్యక్తం చేశారు. అలాగే, క్వినోవా సలాడ్‌లపై సరైన అభ్యర్థి గురించి అంతులేని వాట్సాప్ చర్చలు కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. ఇక, ఓటు వేసేందుకు క్యూలో సాధారణ వ్యక్తులతో కలిసి నడవడం ఇష్టం లేకపోవడం వల్లే వారు తమ ఓటు హక్కును వినియోగించుకోరని పేర్కొన్నారు. అలాగే, సంపన్నుల అసలు ఎందుకు ఓటు వేయాలి? అని కూడా ఆలోచిస్తారని హర్ష గోయెంకా పేర్కొన్నారు.