Delimitation Bill: మీ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వండి.. అఖిలేష్‌కు అమిత్ షా కౌంటర్..
- డిలిమిటేషన్ బిల్లుపై లోక్‌సభలో వాడీ వేడీ చర్చ..
- ముస్లిం మహిళకు రిజర్వేషన్లు కల్పించాలని అఖిలేష్ డిమాండ్..
- మీ పార్టీ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వాలని అమిత్ షా కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation Bill: కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకురాబోంది. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ బిల్లులపై చర్చకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే, పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహిళకు 33 శాతం రిజర్వేషన్ల కోసం మూడు కీలక బిల్లులు అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, ఈ బిల్లులు రాజ్యంగపరమైన ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి.
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ఇదిలా ఉంటే, మహిళా రిజర్వేషన్లు ఆమోదం పొందిన తర్వాత ముస్లిం మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని అఖిలేష్ యాదవ్ అన్నారు. జనాభా లెక్కల కోసం ప్రభుత్వం ఎందుకు వేచిచూడటం లేదని ప్రశ్నించారు. తన పార్టీ కుల గణనను కూడా డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు.
దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ.. జనాభా గణన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, కుల గణన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని , ప్రస్తుతం గృహ గణన పనులు జరుగుతున్నాయని, జనాభా గణన జరిగినప్పుడు కుల గణన కూడా చేర్చుతామని ఆయన చెప్పారు. మత ఆధారిత రిజర్వేషన్ల ఆలోచనను అమిత్ షా తిరస్కరించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని, మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారు. అఖిలేష్ యాదవ్ డిమాండ్లపై విమర్శలు చేస్తూ.. అఖిలేష్ యాదవ్ తన పార్టీ టికెట్లన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వొచ్చని, ఆయన పార్టీకి ఎలాంటి సమస్యల ఉండదని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
-
‘Varanasi’ Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు ‘వారణాసి’ మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!