Delhi: ఢిల్లీలో కుండపోత వర్షం.. 10 విమానాల దారి మళ్లింపు
- ఢిల్లీలో కుండపోత వర్షం
- 10 విమానాల దారి మళ్లింపు
దేశ రాజధాని ఢిల్లీని కుండపోత వర్షం ముంచెత్తింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం సాయంత్రం హఠాత్తుగా అత్యంత భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ చెరువుల్ని తలపించాయి. మరోవైపు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో 10 విమానాలను దారి మళ్లించారు.
ఇదిలా ఉంటే శనివారం రాజిందర్ నగర్‌లోని ఒక కోచింగ్ సెంటర్లోకి నీళ్లు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు చనిపోయిన.. కోచింగ్ సెంటర్లోకి తాజాగా కూడా నీళ్లు బేస్మెంట్లోకి వెళ్లాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారులు మొద్ద నిద్ర వీడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అనేక చోట్ల మోకాళ్ల లోతు నీటిలో ప్రజలు తిరుగుతూ ఇబ్బంది పడ్డారు.
Also Read
తాజా వర్షంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. కోచింగ్ సెంటర్లు ఉన్న ప్రాంతాలతో సహా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులందరినీ హెచ్చరించారు. ఈ మేరకు సక్సేనా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ (ఐటీఓ) జంక్షన్, కన్నాట్ ప్లేస్, మింటో రోడ్, మోతీ బాగ్ ఫ్లైఓవర్‌తో పాటు పొడవైన ట్రాఫిక్ జామ్‌లతో పాటు భారీ నీటి ఎద్దడిని పలు ప్రాంతాలు కలిగి ఉన్నాయి. మింటో వంతెన కింద ఉన్న పాస్ మూసివేశారు. ఇక ఢిల్లీలోని మూడు నాలుగు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయినట్లుగా వార్తలు అందుతున్నాయి. ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదు. ఇక ఢిల్లీలో రెండు గంటలపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో మరియు స్పైస్‌జెట్‌తో సహా పలు విమానయాన సంస్థలు విమానాలు దారి మళ్లించబడ్డాయి. ప్రయాణికులు ఆయా విమానాల స్థితిని వైబ్సైట్లలో చూసుకోవాలని సూచించారు. పూణే నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన UK998 విమానం లక్నోకు మళ్లించబడిందని విస్తారా తెలిపింది. అయితే ఎయిర్ఇండియా తన అతిథులకు విమానాశ్రయానికి త్వరగా బయలుదేరాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Film Chamber: గద్దర్ అవార్డులపై సీఎం కామెంట్స్.. ఫిలిం ఛాంబర్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్‌వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!