NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో కుండపోత వర్షం.. 10 విమానాల దారి మళ్లింపు

Delhirain

Delhirain

దేశ రాజధాని ఢిల్లీని కుండపోత వర్షం ముంచెత్తింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం సాయంత్రం హఠాత్తుగా అత్యంత భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ చెరువుల్ని తలపించాయి. మరోవైపు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో 10 విమానాలను దారి మళ్లించారు.

ఇదిలా ఉంటే శనివారం రాజిందర్ నగర్‌లోని ఒక కోచింగ్ సెంటర్‌లోకి నీళ్లు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు చనిపోయిన.. కోచింగ్ సెంటర్‌లోకి తాజాగా కూడా నీళ్లు బేస్‌మెంట్‌లోకి వెళ్లాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారులు మొద్ద నిద్ర వీడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అనేక చోట్ల మోకాళ్ల లోతు నీటిలో ప్రజలు తిరుగుతూ ఇబ్బంది పడ్డారు.

తాజా వర్షంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. కోచింగ్ సెంటర్లు ఉన్న ప్రాంతాలతో సహా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులందరినీ హెచ్చరించారు. ఈ మేరకు సక్సేనా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్ (ఐటీఓ) జంక్షన్, కన్నాట్ ప్లేస్, మింటో రోడ్, మోతీ బాగ్ ఫ్లైఓవర్‌తో పాటు పొడవైన ట్రాఫిక్ జామ్‌లతో పాటు భారీ నీటి ఎద్దడిని పలు ప్రాంతాలు కలిగి ఉన్నాయి. మింటో వంతెన కింద ఉన్న పాస్ మూసివేశారు. ఇక ఢిల్లీలోని మూడు నాలుగు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయినట్లుగా వార్తలు అందుతున్నాయి. ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదు. ఇక ఢిల్లీలో రెండు గంటలపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో మరియు స్పైస్‌జెట్‌తో సహా పలు విమానయాన సంస్థలు విమానాలు దారి మళ్లించబడ్డాయి. ప్రయాణికులు ఆయా విమానాల స్థితిని వైబ్‌సైట్లలో చూసుకోవాలని సూచించారు. పూణే నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన UK998 విమానం లక్నోకు మళ్లించబడిందని విస్తారా తెలిపింది. అయితే ఎయిర్‌ఇండియా తన అతిథులకు విమానాశ్రయానికి త్వరగా బయలుదేరాలని సూచించింది.

ఇది కూడా చదవండి: Film Chamber: గద్దర్ అవార్డులపై సీఎం కామెంట్స్.. ఫిలిం ఛాంబర్ కీలక వ్యాఖ్యలు