Site icon NTV Telugu

Building Collapses: ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి

Delhi

Delhi

Building Collapses: దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్‌ ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మరణించగా.. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కూలిపోయిన భవనంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగిందని అదనపు పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ కుమార్‌ చెప్పుకొచ్చారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అయితే, నలుగురు చనిపోయారని.. ఇద్దరు గాయపడినట్లు పేర్కొన్నారు. ఇక, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అత్వాల్ మాట్లాడుతూ.. తెల్లవారుజామున 2.50 గంటల ప్రాంతంలో ఇల్లు కూలిపోయినట్లు సమాచారం వచ్చింది.. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ బృందాలు కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. కూలిపోయిన ఆరు అంతస్తుల భవనంలో ఇద్దరు వ్యక్తులు.. ఇద్దరు మహిళలు ఉండగా.. ఓ మహిళకు ముగ్గురు పిల్లలు, మరో మహిళలకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు.. ప్రస్తుతం వారు ఎక్కడా కనిపించడం లేదన్నారు.

Exit mobile version