Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Delhi Woman Dies After Car Drags Her For 12 Kilometres On New Year Morning

Delhi: తీవ్ర విషాదం.. మహిళను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కార్..

Published Date :January 2, 2023 , 7:19 am
By Venu Goapl Reddy
Delhi: తీవ్ర విషాదం.. మహిళను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కార్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Delhi Woman Dies After Car Drags Her For 12 Kilometres On New Year Morning: న్యూ ఇయర్ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒళ్లుగగుర్పాటుకు గురయ్యే యాక్సిడెంట్ ఢిల్లీలో జరిగింది. మహిళను ఢీకొట్టిన తర్వాత దాదాపుగా 10-12 కిలోమీటర్లు లాక్కెలింది కారు. ఈ ప్రమాదంలో మహిళ శరీరం దాదాపుగా ఛిద్రం అయింది. ఈ ఘటన ఢిల్లీలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మృతురాలు అంజలి (20) ఢిల్లీ నివాసి. మహిళ పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లలో పార్ట్ టైమ్ వర్కర్ గా పనిచేస్తుంది. ఆదివారం కూడా ఇలాంటి ఫంక్షన్ కు హాజరై ఇంటికి స్కూటీపై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మహిళను కారు సుల్తాన్‌పురి నుండి ఢిల్లీలోని కంఝవాలా వరకు నాలుగు కిలోమీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది. కారులోని ఐదుగురు వ్యక్తులు తన కూతురుపై అత్యాచారం జరిపారని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోహిణి జిల్లాలోని కంఝవాల్ పోలీసులకు ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కుతుబ్‌గఢ్ వైపు వెళ్తున్న గ్రే బాలెనో కారు మహిళ మృతదేహాన్ని ఈడ్చుకెళ్తోందని కాల్ వచ్చిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఫోరెన్సిక్ నిపుణులతో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఢిల్లీ పోలీసులు.

Delhi

Read Also: Crime News: భార్యతో గొడవపెట్టుకుని బిడ్డను నేలకేసి కొట్టిన తండ్రి

కారు నంబర్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తమ కారు స్కూటీతో ప్రమాదానికి గురైందని నిందితులు చెప్పారు, అయితే ఆమెను తమ కారుతో పాటు అనేక కిలోమీటర్లు ఈడ్చుకెళ్లినట్లు తమకు తెలియదని నిందితులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారం ఆరోపణలను కొట్టిపారేశారు. ప్రమాద సమయంలో నిందితులు మద్యం తాగి ఉన్నారా..? అనే వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. వారి శాంపిళ్లను పరీక్షలకు పంపారు.

ఈ ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ఈ ఘటన చూసి షాక్ అయ్యాను అంటూ ట్వీట్ చేశారు. ఈ కేసులను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్పందిస్తూ కారులో ఉన్న వ్యక్తులు మద్యం తాగి ఉన్నారని సమాచారం అని అన్నారు. ఐదుగురు వ్యక్తుల మద్యం తాగి డ్రైవింగ్ చేశారా..డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • car drags woman
  • Delhi
  • Delhi Accident
  • swati maliwal
  • vk saxena

తాజావార్తలు

  • YS Jagan Padayatra: వచ్చే సంవత్సరం నా పాదయాత్ర.. ఇక, చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపిస్తాం..!

  • RaashiKhanna : బ్లాక్ డ్రెస్ లో ముద్దొస్తున్న రాశి ఖన్నా

  • India Advisory Iran: “వెంటనే బయలుదేరండి”.. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులకు కీలక హెచ్చరిక..

  • AC Sales Decline: పడిపోయిన ఏసీల అమ్మకాలు.. కారణం అదేనా..?

  • Flying Flea C6 Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. 3.7 సెకన్లలో 60 km/h వేగం.. 154KM రేంజ్

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions