AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
- ఢిల్లీ అగ్ని ప్రమాదంలో కీలక విషయాలు..
- ఏసీ పేలుడుతో 9 మంది మృతి..
- భవన డిజైన్, బాల్కానీలో ఐరన్ గ్రిల్స్, స్మార్ట్ డోర్స్ కారణాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AC Blast: ఢిల్లీలోని వివేక్ విహార్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామును ఏసీ కంప్రెషర్‌లో పేలుడు సంభవించడం వల్లే ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యలు చెబుతున్నారు. ఏసీ పేలడం వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతోనే మంటలు వేగంగా వ్యాపించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అయితే, ఏసీ పేలుడు మాత్రమే నాలుగు అంతస్తుల భవనంలో ఈ భారీ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. ప్రతీ అంతస్తులో 2 ఫ్లాట్ల చొప్పున 8 ఫ్లాట్లు ఉన్న ఈ భవన డిజైన్ లోపం కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఒకటే మెట్ల వరస ఉండటం కూడా బయటకు వెళ్లే మార్గాన్ని ప్రభావితం చేసింది. మంటలు వ్యాపించినా ప్రజలు బయటకు రావడం కష్టంగా మార్చింది. ఇదే కాకుండా రెండో అంతస్తులోని ఫ్లాట్‌లో ఉన్న స్మార్ట్ డోర్ లాక్స్ షార్ట్ సర్క్యూట్ కారణంగా లాక్ అయ్యాయి. దీంతో ఆ ఫ్లాట్‌లో ఉన్న కుటుంబాలు బయటకు రాలేకపోయాయి. ఇక్కడే ఐదుగురు మరణించారు.
Also Read
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
READ ALSO: SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
భవనంలో ఉన్న చెక్క గోడలు మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమయ్యాయి. పై అంతస్తులో ముగ్గురు నివాసితులు టెర్రస్ పైకి పారిపోయేందుకు ప్రయత్నించారు. టెర్రర్ తలుపుకు తాళం వేసి ఉండటంతో తప్పించుకునే మార్గం లేకపోయింది. దీంతో మంటలు వారిని చుట్టుముట్టకముందే పొగ వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారి చనిపోయారు. మొదటి అంతస్తులో మరో మృతదేహం లభ్యమైంది. తలుపులు జామ్ కావడంతో బయటపడలేకపోయాడు.
ఇదే కాకుండా భవనంలోకి ప్రవేశించడానికి అగ్నిమాపక సిబ్బంది చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. మంటలు భవనం వెనక ప్రారంభమైన పైకి కిందకు వ్యాపించాయి. ఫ్లాట్లకు వెనక ఉన్న బాల్కనీలకు పక్షులు రాకుండా వలలతో మూసేశారు. వీటిని ఫైర్ ఫైటర్స్ కత్తిరించడానికి సమయం పట్టింది. బాల్కనీల్లో రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న ఐరన్ గ్రిల్స్ రెస్క్యూ ఆపరేషన్‌ను ఆలస్యం చేశాయి.
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!