NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో దారుణం.. సివిల్స్ విద్యార్థిని ఆత్మహత్య.. కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్

Iascochingdelhi

Iascochingdelhi

ఓ విద్యా కుసుమం అర్ధాంతరంగా నేలరాలిపోయింది. ఉన్నతమైన కొలువును సంపాదించేందుకు మహోన్నతమైన ఆశయంతో మహా నగరానికి పోతే.. చివరికి మధ్యలోనే జీవిత ప్రయాణం ముగిసిపోయింది. ఈ ఘోరం దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Minister Atchannaidu: మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన.. ఆ చట్టం రద్దు..

ఇటీవల ఢిల్లీలో ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు సివిల్స్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కానీ దీని కంటే ముందుగా ఓ సివిల్స్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చుట్టూ కమ్ముకున్న ఆర్థిక ఇబ్బందులు, తీవ్రమైన ఒత్తిడి ఆమెను చావు వైపు నడిపించాయి. ఒత్తిడిలో ఆమె తీసుకున్న నిర్ణయంతో శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి.. కన్న తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చి వెళ్లిపోయింది.

ఇది కూడా చదవండి: Raj Tarun – Lavanya: ఇదెక్కడి ట్విస్ట్ మావా.. డ్రగ్స్ అలవాటు చేసిందని లావణ్యపై ఫిర్యాదు?

ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో అంజలి అనే యువతి మహారాష్ట్ర నుంచి 2022లో ఢిల్లీకి వచ్చింది. మూడు సార్లు పరీక్ష రాసినా విజయం సాధించలేకపోయింది. దీంతో మానసిక ఒత్తిడికి గురైంది. అంతే ఈ లోకాన్ని విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సూసైడ్‌ లేఖలో తన మరణానికి గల కారణాలు వెల్లడించింది. అమ్మ, నాన్న క్షమించండి. తాను చాలా విసిగిపోయాను. ఒత్తిడి నుంచి బయటకు రావడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ తన వల్ల కావడం లేదని నోట్‌లో పేర్కొంది.

ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర ఒత్తిడి భరించలేకే అంజలి ఆత్మహత్యకు చేసుకుందని ఆమె స్నేహితురాలు మీడియాకు తెలిపింది. హాస్టల్ ఫీజు కూడా బాగా పెరగడంతో.. అద్దె చెల్లించలేక ప్రాణాలు తీసుకుందని చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోచింగ్ సెంటర్ ఘటనపై విద్యార్థుల ఆందోళన చేస్తున్న సమయంలో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

Show comments