Site icon NTV Telugu

Delhi: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని స్నేహ అదృశ్యం.. రంగంలోకి పోలీసులు

Delhistudent

Delhistudent

దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థిని స్నేహ దేబ్నాథ్(19) అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ యూనివర్సిటీలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాలకు చెందిన విద్యార్థిని స్నేహ దేబ్నాథ్ జూలై 7న అదృశ్యమైంది. ఆమె స్వస్థలం త్రిపుర. ఢిల్లీకి వచ్చి చదువుకుంటోంది. మాజీ సైనికుడు, సుబేదార్ మేజర్ (గౌరవ లెఫ్టినెంట్) ప్రీతిష్ దేబ్నాథ్ (రిటైర్డ్) కుమార్తె. ప్రస్తుతం ఆమె మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతోంది. డయాలసిస్ చేయించుకుంటోంది. అయితే బిడ్డ సమాచారం తెలియకపోవడంతో పేరెంట్స్ తల్లడిల్లుతున్నారు. కుమార్తె జాడ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇక 48 గంటల తర్వాత బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. అలాగే తమ బిడ్డ జాడను తెలియజేయాలని ప్రజలకు బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది.

ఇది కూడా చదవండి: Air India Crash: ఎయిర్ ఇండియా క్రాష్ రిపోర్టుపై పైలట్ల సందేహాలు..

జూలై 7న స్నేహితురాలిని సారాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్‌లో దించేందుకు స్నేహ వెళ్లింది. ఉదయం 6:45 గంటలకు స్నేహితురాలిని దింపబోతున్నట్లు కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం అందించింది. ఉదయం 5:56 గంటలకు తల్లి ఫోన్ చేసినప్పుడు మాట్లాడింది. తిరిగి ఉదయం 8:45 గంటలకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాప్ అని వచ్చింది. అయితే స్నేహ.. స్నేహితురాలిని కలవలేదని తెలుస్తోంది. క్యాబ్ డ్రైవర్‌.. రైల్వే స్టేషన్‌లో దింపడానికి బదులుగా సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర దింపాడని తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉంటే బ్రిడ్జి దగ్గర సీసీ కెమెరాలు పని చేయడం లేదు. దీంతో బాధిత కుటుంబం మరింత ఆందోళనకు గురవుతోంది.

ఇది కూడా చదవండి: Shravan Masam 2025: శ్రావణ మాసంలో శివుడిని పూజించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు…

ఇక స్నేహ అదృశ్యంపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా.. ఢిల్లీ అధికారులను సంప్రదించారు. ఆమె జాడను కనుగొనాలని ఢిల్లీ పోలీసులను కోరారు. అంతేకాకుండా ఇంకోవైపు కుటుంబ సభ్యులు కూడా గాలిస్తున్నారు. ఇక ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్.. స్నేహ కోసం గాలిస్తున్నారు. అయితే ఆమె దగ్గర ఎలాంటి వస్తువులు లేనట్లుగా తెలుస్తోంది. కేవలం ఆమె దగ్గర ఫోన్ మాత్రమే ఉంది. అంతేకాకుండా 4 నెలలుగా స్నేహ ఎటువంటి నగదు కూడా తీసుకోలేదని గుర్తించారు. ఇక స్నేహ అదృశ్యమైన 48 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ బుక్ అయింది. అయితే సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version