Delhi Murder Case: ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక సాక్షి హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాహిల్ అనే 20 ఏళ్ల వ్యక్తి అత్యంత క్రూరంగా సాక్షిని 20 కన్నా ఎక్కువ సార్లు పొడిచి, బండరాయితో మోది హత్య చేశారు. ఈ హత్యకు మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. హత్య అనంతంర సాహిల్ అక్కడ నుంచి పారిపోయాడు. కానీ చివరకు ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. సాక్షిని హత్య చేసిన వెంటనే సాహిల్ ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లోని బందువుల ఇంటికి వెళ్లాడు. బస్సులో ప్రయాణించాడు. అయితే స్విచ్చాన్ చేసి తండ్రికి ఫోన్ చేయడంతో పోలీసులు సాహిల్ ఎక్కడున్నాడో గుర్తించి, లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు.
Read Also: Kishan Reddy: ఢిల్లీలోని పురానా ఖిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది..
మరోవైపు సాక్షి పోస్టుమార్టం నివేదిక, ఈ హత్య ఎంత క్రూరంగా జరిగిందనే విషయాలను వెల్లడిస్తోంది. పుర్రె భాగం మొత్తం పగిలిపోయినట్లు తేలింది. బండరాయితో మోదడంతో పుర్రె పూర్తిగా ఛిద్రమైంది. సాక్షితో సాహిల్ కు మూడేళ్లుగా పరిచయం ఉందని, అయితే ఇటీవల సాహిల్ ను దూరం పెట్టడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతడు, బాలికను దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. నిందితుడు సాహిల్ కు హుక్కా, మద్యపానం అలవాటు ఉన్నట్లు అతని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా గుర్తించారు.
ఇదిలా ఉంటే తాజాగా మంగళవారం జరిగిన విచారణలో నిందితుడు సాహిల్, 16 ఏళ్ల సాక్షిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీస్ వర్గాలు తెలిపాయి. సమాచారం ప్రకారం.. హత్య జరిగినప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చిత్రాలను చూపిన సందర్భంలో వీడియోలో ఉన్న వ్యక్తిని నేనేనని, సాక్షిని నేనే చంపానని సాహిల్ ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ హత్య పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. పలు రాజకీయ పార్టీలు, నేతలు సాక్షి ఇంటికి క్యూ కట్టారు. సాక్షి తల్లిదండ్రులు నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు ఎందుకు హత్య చేశాడనే విషయం తమకు తెలియదని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు.