Site icon NTV Telugu

Delhi Car Blast Live Updates : 12 మంది మృతి.. పేలుడు ఘటనలో ఉగ్ర కుట్ర..!

Delhi

Delhi

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు కలకలం సృష్టించింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఒక కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు సంభవించిన వెంటనే మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు వాహనాలకు వ్యాపించాయి. మొత్తం నాలుగు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడుకు గల కారణాలు ఏమిటి? ఇది కేవలం సాంకేతిక లోపమా? లేక మరేదైనా కారణం ఉందా? లైవ్ ఆప్డేట్స్ చూస్తునే ఉండండి..

The liveblog has ended.
  • 11 Nov 2025 07:42 PM (IST)

    మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా..

    ఢిల్లీ పేలుడులో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా. శాశ్వత అంగవైకల్యం కలిగినవారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన. క్షతగాత్రులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం. బాధితులకు అండగా ఉంటామన్న ఢిల్లీ సర్కార్‌.

  • 11 Nov 2025 06:17 PM (IST)

    ఫరీదాబాద్‌ డాక్టర్లకు ఉగ్రవాదులతో సంబంధం..

    ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు వేగవంతం. ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రాథమిక నివేదిక. కేంద్ర హోంశాఖకు ప్రాథమిక నివేదికను అందజేసిన ఢిల్లీ పోలీసులు. జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థతో ఫరీదాబాద్‌ డాక్టర్లకు సంబంధాలపై రిపోర్టు.

  • 11 Nov 2025 05:28 PM (IST)

    ఢిల్లీ పేలుడు బాధితుల కోసం భూటాన్‌ రాజు ప్రార్థనలు

    ఢిల్లీ పేలుడు బాధితుల కోసం భూటాన్‌ రాజు ప్రార్థనలు. బాధితుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసిన భూటాన్‌ రాజు. థింపూలో వేలాది మంది భూటాన్‌ వాసులతో కలసి ప్రార్థనలు.

  • 11 Nov 2025 03:19 PM (IST)

    ఢిల్లీ బ్లాస్ట్‌ కంటే ముందు పొల్యూషన్‌ చెక్‌ చేయించిన ఉగ్రవాదులు...

    ఢిల్లీ పేలుడు కేసులో బయటకు వచ్చిన i20 కారు మరో వీడియో. ఢిల్లీ బ్లాస్ట్‌ కంటే ముందు పొల్యూషన్‌ చెక్‌ చేయించిన ఉగ్రవాదులు. పోలీసులు కారు ఆపినా డౌట్‌ రాకుండా ఉండేందుకు ప్రయత్నం. పొల్యూషన్‌ చెకింగ్‌ సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు.

  • 11 Nov 2025 03:11 PM (IST)

    ఫరీదాబాద్‌లో మరోసారి భారీగా పేలుడు పదార్థాలు లభ్యం...

    ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత. విచారణ జరపనున్న NIA బృందం. ఫరీదాబాద్‌లో మరోసారి భారీగా పేలుడు పదార్థాలు లభ్యం. సెక్టార్‌ 56లోని అద్దె ఇంటిలో భారీగా పేలుడు పదార్థాలు గుర్తింపు. దర్యాప్తు సంస్థల అదుపులో లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షహీన్‌ షాహిద్‌.

  • 11 Nov 2025 02:48 PM (IST)

    పుల్వామాలో ముగ్గురు అనుమానితుల అరెస్ట్..

    ఢిల్లీ పేలుళ్లపై దర్యాప్తు ముమ్మరం.. రంగంలోకి ఎన్‌ఎస్‌జీ, ఎన్‌ఐఏ బృందాలు.. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌ పరిశీలన.. పుల్వామాలో ముగ్గురు అనుమానితుల అరెస్ట్..

  • 11 Nov 2025 01:51 PM (IST)

    అమిత్ షా నివాసంలో ముగిసిన ఉన్నతస్థాయి సమీక్ష

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో ముగిసిన ఉన్నతస్థాయి సమీక్ష.. భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం.. ఎర్రకోట కారు పేలుడు ఘటన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం..

  • 11 Nov 2025 12:34 PM (IST)

    పెరుగుతున్న మృతుల సంఖ్య..

    ఢిల్లీ పేలుడు ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. 12కు చేరిన మృతుల సంఖ్య.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి.. గాయపడిన మరో 17 మందికి ఆస్పత్రిలో చికిత్స..

  • 11 Nov 2025 12:29 PM (IST)

    నిందితులను కఠినంగా శిక్షిస్తాం - -రాజ్‌నాథ్‌ సింగ్

    ఢిల్లీ పేలుళ్లపై స్పందించిన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్.. ఘటనపై దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ చేస్తున్నాయి.. నిందితులను కఠినంగా శిక్షిస్తాం.. బాధితులకు న్యాయం చేస్తాం-రాజ్‌నాథ్‌ సింగ్

  • 11 Nov 2025 12:23 PM (IST)

    కుట్ర దారులను చట్టం ముందు నిలబెడతాం-ప్రధాని మోడీ

    ఢిల్లీ పేలుడు ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ.. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్ర మూలాలను గుర్తించాం.. ఘటనకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదు.. ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం.. పేలుడుకు కుట్ర దారులను చట్టం ముందు నిలబెడతాం-ప్రధాని మోడీ

  • 11 Nov 2025 12:07 PM (IST)

    రేపు సాయంత్రం కేంద్ర కేబినెట్‌ సమావేశం

    రేపు సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం.. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

  • 11 Nov 2025 10:48 AM (IST)

    విష ప్రయోగం చేసి చంపాలని కుట్ర..

    హైదరాబాద్‌లో అరెస్టైన ఉగ్రవాది డాక్టర్‌ మొయినుద్దీన్‌ నుంచి కీలక సమాచారం.. రాజేంద్రనగర్‌లో మొయినుద్దీన్‌ను అరెస్టు చేసిన గుజరాత్ ఏటీఎస్‌.. భారీ మొత్తంలో విష ప్రయోగం చేసి చంపాలని కుట్ర.. రెసిన్‌ విషాన్ని తయారు చేస్తున్న సయ్యద్ మొయినుద్దీన్.. దేవాలయాలు, వాటర్‌ ట్యాంక్‌లో రెసిన్‌ కలిసి సామూహిక విష ప్రయోగం చేయాలని కుట్ర.. ఇప్పటికే సయ్యద్‌తో పాటు నలుగురిని అరెస్ట్ చేసిన గుజరాత్ ఏటీఎస్

  • 11 Nov 2025 09:18 AM (IST)

    ఎయిర్‌పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం..

    ఢిల్లీలో పేలుళ్లతో దేశవ్యాప్తంగా హై అలర్ట్.. అన్ని ఎయిర్‌పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం.. మూడు రోజుల పాటు ఎయిర్‌పోర్టుల్లో హై సెక్యూరిటీ.. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశం.. ఎయిర్‌పోర్టు పార్కింగ్‌పైనా దృష్టిపెట్టాలని ఆదేశం

  • 11 Nov 2025 08:05 AM (IST)

    ఐ20 కారు పుల్వామాకు చెందిన తారిఖ్‌దిగా గుర్తింపు..

    ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. పేలుడుకు కారణమైన ఐ20 కారు పుల్వామాకు చెందిన తారిఖ్‌దిగా గుర్తింపు.. ముగ్గురు చేతులు మారిన ఐ20 కారు.. చివరిసారిగా కారును కొనుగోలు చేసిన తారిఖ్‌.. పేలుడుకు కొన్ని క్షణాల ముందు కారు నడపిన డాక్టర్‌ మహ్మద్‌ ఉమర్.. కీలకంగా మారిన సీసీ టీవీ ఫుటేజ్.. ఉదయం 9.30 గంటలకు పేలుళ్లపై అమిత్‌షా ఉన్నతస్థాయి సమీక్ష

  • 11 Nov 2025 12:45 AM (IST)

    ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ స్పందన

    పేలుడు జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్. “ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో తమ ప్రియమైన వారిన కోల్పోయిన కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. బాధితులకు అధికారులు అందుబాటులో ఉన్న అన్ని విధాల సాయం అందిస్తున్నారు. ఘటనపై హోంమంత్రి అమిత్ షా జీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను.” అని పేర్కొన్నారు.

  • 11 Nov 2025 12:16 AM (IST)

    LNJP ఆస్పత్రికి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా

    ఢిల్లీ: LNJP ఆస్పత్రికి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. పేలుడు ఘటనలో గాయపడినవారిని పరామర్శించిన సీఎం రేఖా గుప్తా.

  • 10 Nov 2025 11:36 PM (IST)

    ఢిల్లీ పేలుడుపై ఉగ్రకోణంలో పలు అనుమానాలు

    ఢిల్లీ పేలుడుపై ఉగ్రకోణంలో పలు అనుమానాలు. ఇటీవల తనిఖీల్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ఇద్దరు డాక్టర్లు అరెస్ట్‌. ఇదే సమయంలో ఎర్రకోట వద్ద భారీ పేలుడు. పట్టుబడక ముందే దాడి చేయాలన్న పథకంలో భాగమా.?

  • 10 Nov 2025 11:06 PM (IST)

    ఏపీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయాలి: డీజీపీ

    అమరావతి: ఢిల్లీలో పేలుడు సందర్భంగా డీజీపీ ఆదేశాలు. ఏపీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు. అన్ని జిల్లాల ఎస్పీలు, డీఐజీలకు డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా ఆదేశాలు. క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించాలని ఇంటెలిజెన్స్‌కు సూచన. రద్దీ ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలన చేయాలని ఆదేశాలు.

  • 10 Nov 2025 10:31 PM (IST)

    ఘటనా స్థలానికి అమిత్‌ షా..

    ఢిల్లీ: పేలుడు ఘటనా స్థలానికి అమిత్‌ షా. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అమిత్‌ షా.

  • 10 Nov 2025 10:29 PM (IST)

    కారు రిజిస్ట్రేషన్ HR267674..

    పేలుడు జరిగిన కారు రిజిస్ట్రేషన్ నంబర్ HR267674. నదీమ్‌ఖాన్ అనే వ్యక్తి పేరుపై కారు రిజిస్ట్రేషన్.

  • 10 Nov 2025 10:07 PM (IST)

    హర్యానాకు చెందిన కారు..

    కారు హర్యానాకు చెందినదిగా గుర్తింపు. పేలుడు సమయంలో కారులో ముగ్గురు. సాయంత్రం 6:52 గంటలకు పేలుడు.

  • 10 Nov 2025 10:04 PM (IST)

    పేలుడు ఘటనలో 13 మంది మృతి..

    ఢిల్లీలో ఉగ్రదాడి.? పేలుడు ఘటనలో 13 మంది మృతి. కారు వెనుక భాగంలో పేలుడు. పేలుడు సమయంలో కారులో ముగ్గురు.

  • 10 Nov 2025 10:02 PM (IST)

    గాయపడినవారికి అమిత్‌ షా పరామర్శ..

    LNJP ఆస్పత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. పేలుడు ఘటనలో గాయపడినవారికి అమిత్‌ షా పరామర్శ. బాధితుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న అమిత్‌షా. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అమిత్‌షా ఆదేశం. పేలుడుపై NIA, NSG దర్యాప్తు జరుగుతోందని వెల్లడి. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బ్లాస్ట్ జరిగింది. పేలుడు జరగగానే 10 నిమిషాల్లో అధికారులు చేరుకున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు.

  • 10 Nov 2025 09:55 PM (IST)

    LNJP ఆస్పత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

    LNJP ఆస్పత్రికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. పేలుడు ఘటనలో గాయపడినవారికి అమిత్‌ షా పరామర్శ.

  • 10 Nov 2025 09:39 PM (IST)

    ఐ20 కారులో పేలుడు జరిగింది -అమిత్‌ షా

    ఐ20 కారులో పేలుడు జరిగింది. నేను సంఘటనా స్థలానికి వెళ్తున్నా. ప్రస్తుతం ఢిల్లీ సీపీ ఘటనాస్థలిలోనే ఉన్నారు. -అమిత్‌ షా

  • 10 Nov 2025 09:29 PM (IST)

    అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. -అమిత్‌ షా

    పేలుడుపై NIA, NSG దర్యాప్తు జరుగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే నేను సంఘటనా స్థలానికి వెళ్తా. పేలుడు జరగగానే 10 నిమిషాల్లో అధికారులు చేరుకున్నారు. -అమిత్‌ షా

  • 10 Nov 2025 09:07 PM (IST)

    10 మందికి చేరిన మృతుల సంఖ్య..

    ఢిల్లీలో భారీ పేలుడు.. 10 మందికి చేరిన మృతుల సంఖ్య. పేలుడు ధాటికి 24 మందికి తీవ్రగాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం. క్షతగాత్రులను LNJP ఆస్పత్రికి తరలింపు.

  • 10 Nov 2025 08:50 PM (IST)

    ఆగిన వాహనంలో పేలుడు..

    సాయంత్రం 6.52 గంటలకు బ్లాస్ట్‌ జరిగింది. నెమ్మదిగా వచ్చిన వాహనం రెడ్‌లైట్‌ దగ్గర ఆగింది. రెడ్‌ లైట్‌ దగ్గర ఆగిన వాహనంలో పేలుడు జరిగింది. -ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌

  • 10 Nov 2025 08:49 PM (IST)

    ఒకరు అరెస్ట్..

    ఢిల్లీలో పేలుడు ఘటనలో ఒకరు అరెస్ట్. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.

  • 10 Nov 2025 08:45 PM (IST)

    అమిత్‌షాతో మాట్లాడిన ప్రధాని మోడీ..

    ఢిల్లీలో పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు, ఐబీ చీఫ్‌తో మాట్లాడిన అమిత్‌షా. ఢిల్లీలో పేలుడుపై అమిత్‌షాతో మాట్లాడిన ప్రధాని మోడీ.

  • 10 Nov 2025 08:41 PM (IST)

    దర్యాప్తునకు ఆదేశించిన అమిత్‌షా..

    ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పేలుడుపై దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.

  • 10 Nov 2025 08:34 PM (IST)

    హైగ్రేడ్ ఎక్స్‌ప్లోజివ్ ఉపయోగించినట్లు అనుమానం..

    ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ కారులో హైగ్రేడ్ ఎక్స్‌ప్లోజివ్ ఉపయోగించినట్లు అనుమానం. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన కేంద్రహోంమంత్రి అమిత్‌షా.

  • 10 Nov 2025 08:30 PM (IST)

    హైదరాబాద్ సిటీలో నాకా బందీ..

    హైదరాబాద్ సిటీలో నాకా బందీ. రద్దీ ప్రదేశాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సూచించిన సీపీ సజ్జనార్.

  • 10 Nov 2025 08:26 PM (IST)

    ఉన్నతాధికారులతో మాట్లాడిన అమిత్‌షా

    ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన కేంద్రహోంమంత్రి అమిత్‌షా.

  • 10 Nov 2025 08:22 PM (IST)

    డెలివరి బాయ్ సజీవదహనం..

    ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలం దగ్గర భారీ పేలుడు. మంటలు అంటుకొని డెలివరి బాయ్ సజీవదహనం. కారులో భారీ పేలుడు, మరో 8 కార్లకు వ్యాపించిన మంటలు. భారీ పేలుడుతో 8 మంది మృతి.

  • 10 Nov 2025 08:13 PM (IST)

    ముగ్గురి పరిస్థితి విషమం..

    భారీ పేలుడుతో ఉలిక్కిపడ్డ ఢిల్లీ. పేలుడు ఘటనలో 8 మంది మృతి. పేలుడు తీవ్రతకు ఛిద్రమైన మృతదేహాలు. 24 మందికి తీవ్రగాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ఘటనాస్థలికి NIA, NSG బృందాలు.

  • 10 Nov 2025 08:07 PM (IST)

    మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

    పేలుడు ధాటికి ఛిద్రమైన మృతదేహాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయకచర్యలు.

  • 10 Nov 2025 08:04 PM (IST)

    దేశవ్యాప్తంగా హైఅలర్ట్..

    ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముంబై, హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఈ హైఅలర్ట్ ప్రకటించారు. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు.

  • 10 Nov 2025 08:02 PM (IST)

    12 మందికి తీవ్రగాయాలు..

    ఎర్రకోట మెట్రోస్టేషన్ దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారందరిని ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • 10 Nov 2025 07:58 PM (IST)

    8 మంది మృతి

    ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనలో 8 మంది మృతి. పదుల సంఖ్యలో గాయాలు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలింపు.

  • 10 Nov 2025 07:48 PM (IST)

    ఏడు ఫైరింజన్లతో మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది

    ఎర్రకోట మెట్రోస్టేషన్‌ దగ్గర పార్కింగ్‌ చేసిన కారులో పేలుడు. ఎర్రకోట గేట్‌ నంబర్‌ 1 దగ్గర కారులో పేలుడు. పేలుడు ధాటికి పలు వాహనాలకు అంటుకున్న మంటలు. ఏడు ఫైరింజన్లతో మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది. బాంబు స్క్వాడ్‌ బృందాలతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు. ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు. ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు.

  • 10 Nov 2025 07:25 PM (IST)

    ఢిల్లీలో హైఅలర్ట్‌

    ఎర్రకోట దగ్గర పేలుడుతో ఢిల్లీలో హైఅలర్ట్‌. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. పేలుడు ఘటనలో ఒకరు మృతి, ఛిద్రమైన మృతదేహం.

  • 10 Nov 2025 07:16 PM (IST)

    ఢిల్లీలో భారీ పేలుడు

    ఢిల్లీలో భారీ పేలుడు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారులో భారీ పేలుడు. ఐదు కార్లు ధ్వంసం, ఇద్దరికి గాయాలు.

Exit mobile version