NTV Telugu Site icon

Kejriwal: ప్రజా ధనం దుర్వినియోగంపై కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్

Kejriwal

Kejriwal

ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాలపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కేజ్రీవాల్ సహా ఇతరులపై ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లుగా రౌస్ అవెన్యూ కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 18కు ధర్మాసనం వాయిదా వేసింది. కేజ్రీవాల్, ఇతరులపై అధికారిక ఫిర్యాదు తర్వాత దర్యాప్తు ప్రారంభించినట్లు రాష్ట్ర పోలీసులు కోర్టుకు సమాచారాన్ని తెలియజేశారు.

ఇది కూడా చదవండి: Kunal Kamra: మద్రాస్ హైకోర్టులో కునాల్ కమ్రా పిటిషన్.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థన

రాజధాని అంతటా పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడానికి ప్రజా నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్ సహా ఇతరులపై కేసులు నమోదు చేయాలని మార్చి 11న కోర్టు పోలీసులకు ఆదేశాలిచ్చింది. 156(3) Cr.PC సెక్షన్ కింద దరఖాస్తు అనుమతికి అర్హమైనదని కోర్టు పరిగణనలోనికి తీసుకుంది. దీంతో ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డెఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 2007లోని సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నేహా మిట్టల్ తన తీర్పులో పేర్కొన్నారు.

2019లో అప్పటి మటియాలా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ (ఆప్), మరియ ద్వారక ఏ వార్డు మాజీ కౌన్సిల్ నితికా శర్మ… రాజధానిలో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: AIMIM : ఈద్ ప్రార్థనలపై మాటల యుద్ధం.. రోడ్డు మీద నమాజ్ చేస్తామన్న ఎంఐఎం నేత…