Delhi Mayor Election Again Postponed: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఢిల్లీ మేయర్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. కానీ.. ఆప్‌కి అది అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. బీజేపీ కార్యకర్తలు చేస్తున్న రచ్చ కారణంగా.. ఈ ఎన్నిక వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తున్నాయి. నిజానికి.. జనవరి 6వ తేదీనే ఈ ఎన్నిక జరగాల్సింది. అంతకుముందు.. ఈ ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకున్నట్టే తప్పుకొని, చివరి నిమిషంలో మళ్లీ ఎంట్రీ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చింది. వాస్తవానికి.. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలతో ఆప్ విజయం సాధించింది కాబట్టి, మెజారిటీ ప్రకారం మేయర్ పదవి ఆప్‌కే దక్కే అవకాశాలుంటాయి. అయితే.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్ చేత ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించడం వివాదానికి దారి తీసింది. మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులు ఓటు వేయడానికి అనుమతి లేదంటూ ఆప్ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇక అప్పటినుంచి ఈ వ్యవహారం రబ్బర్‌లా సాగుతూనే ఉంది.
Shashi Tharoor: ముషారఫ్‌పై థరూర్ ట్వీట్.. భగ్గుమన్న బీజేపీ
రెండుసార్లు వాయిదా పడినా.. మూడోసారి అయినా మేయర్ ఎన్నిక సజావుగా సాగుతుందనుకుంటే, అదీ విఫలమైంది. మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులు ఓటు వేసేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్యా శర్మ అనుమతి ఇవ్వడంతో.. ఆప్ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఫలితంగా.. మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోకుండానే సభ మళ్లీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆప్ సభ్యుల తీరుని వ్యతిరేకిస్తూ బీజేపీ కౌన్సిలర్లు సభ నుంచి వెళ్లిపోయారు. ఈ దెబ్బకు ఢిల్లీ మేయర్ ఎన్నికపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కాగా.. ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రమాణ స్వీకారం చేయించిన నామినేటెడ్ సభ్యులపై ఆప్ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే! ఈ వ్యవహారం ఎప్పుడు తెగుతుందో, ఆప్ మేయర్ కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.
Balakrishna: నర్సులపై చేసిన వ్యాఖ్యల దుమారం.. వక్రీకరంచారంటూ బాలయ్య వివరణ
