Site icon NTV Telugu

Kangana Ranaut: కంగనాపై కాంగ్రెస్ నేత వివాదాస్పద పోస్ట్.. విచారణకు ఆదేశించిన ఢిల్లీ ఎల్‌జీ..

Kangana Ranaut.

Kangana Ranaut.

Kangana Ranaut: బాలీవుడ్ యాక్టర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై వివాదాస్పద పోస్టు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రినేట్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఆమెకు పార్టీ లోక్‌సభ టికెట్ నిరాకరించింది. తాజాగా కంగనాపై ఆమె చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనా విచారణకు ఆదేశించారు. బీజేపీ ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ ఫిర్యాదుతో గురువారం విచారణ ప్రారంభించాలని పోలీస్ కమీషనర్‌ని ఆదేశించారు.

Read Also: Prank turns deadly: ప్రాంక్ ప్రాణం తీసింది.. స్నేహితుడి ప్రైవేట్ పార్టులోకి హై ప్రెషర్ ఎయిర్..

శ్రినేట్‌పై దర్యాప్తు జరిపి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ ఎల్‌జీకి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. హిమాచల్ ప్రదేశ్ మండి లోక్‌సభ స్థానం నుంచి కంగనా రనౌత్‌కి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ పరిణామం తర్వాత కంగనా రనౌత్‌పై సుప్రియా శ్రినేట్ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ‘వేశ్య’ అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఈ పోస్టు తాను చేయలేదని తన అకౌంట్ యాక్సెస్ చాలా మంది వద్ద ఉందని ఆమె సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆమె చేసిన పోస్టు వివాదాస్పదం కావడంతో వెంటనే దాన్ని డిలీట్ చేశారు. ఈ విషయంలో శాస్త్రీయ విచారణ చేపట్టి, అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని ఎల్జీ సక్సేనా కమిషనర్‌ని కోరారు. సోషల్ మీడియా పోస్ట్ వెనుక ఎవరు ఉన్నారో, ఎవరి మొబైల్ ఫోన్‌ను దీని కోసం ఉపయోగించారో దర్యాప్తు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ పోలీసులను కోరారు.

Exit mobile version