Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఈ రోజుతో కస్టడీ ముగియడంతో మనీస్ సిసోడియాను సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో పురోగతి ఉందని, సిసోడియా రిమాండ్ పొడగించాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు. సీబీఐ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు సిసోడియా రిమాండ్ ను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 12 వరకు ఆయన జ్యుడిషియల్ రిమాండ్ ను పొడగించింది కోర్టు. ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు.
Read Also: Mallikarjun Kharge: ప్రధాని మోదీ “విషపు పాము”.. కాంగ్రెస్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ పార్టీ మెడకు చుట్టుకుంది. ఇప్పటికే ఈ కేసులో సౌత్ గ్రూప్ కు చెందిన పలువురు అరెస్ట్ అయ్యారు. డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా ఈ స్కామ్ లో కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే గత వారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా సీబీఐ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో ఇదంతా బూటకపు కేసు అని, అసలు లిక్కర్ స్కామే జరగలేదని ఆప్ పార్టీ ఆరోపిస్తోంది. కావాలనే బీజేపీ కేంద్ర సంస్థల్ని ఉపయోగించి ప్రతిపక్షాలను వేధిస్తున్నాయంటూ మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు.