NTV Telugu Site icon

Delhi Air Pollution: దేశంలోనే అత్యంత కలుషితమైన నగరం ఢిల్లీనే..

Delhi

Delhi

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నాటికి వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయి AQI 500 మార్క్ ను దాటేసింది. ఆ తర్వాత క్రమంగా కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పడుతుంది. బుధవారం ఢిల్లీ నగరంలో గాలి నాణ్యతలో స్వల్ప మెరుగుదల కనబడింది. నిన్న సాయంత్రం 4 గంటల వరకు ఏక్యూఐ 419గా నమోదు అయింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఈరోజు (గురువారం) ఉదయం 7 గంటలకు AQI ప్రమాదకర కేటగిరీ నుంచి 379కి చేరింది. అయితే, దేశంలోని 70కి పైగా నగరాలు ప్రస్తుతం వాయు కాలుష్యం నుంచి ఉపశమనం పొందుతున్నాయని చెప్పవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని పలువురు తెలిపారు.

Read Also: Kubera : ధనుష్ ‘కుబేర’ రిలీజ్ డేట్ లాక్.. శేఖర్ కమ్ముల ప్లాన్ మామూలుగా లేదుగా

కాగా, ప్రస్తుతం ఢిల్లీలో గ్రేడ్ 4 ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కానీ కాలుష్యానికి హాట్‌స్పాట్‌గా మారిన ఢిల్లీలోని ఆనంద్ విహార్ ఏరియాలో గాలి ఇప్పటికీ ప్రమాదకరమైన కేటగిరీలోనే కొనసాగుతుంది. ఉదయం 6 గంటలకు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తాజా సమాచారం ప్రకారం AQI 406గా రికార్డైంది. దీంతో పాటు ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఎన్‌సీఆర్‌లోని నోయిడా AQI 304గా, ఘజియాబాద్ AQI 328 నగరాలలో గాలి నాణ్యత చాలా పేలవ కేటగిరీలోకి వెళ్లింది. ఈ క్రమంలో వచ్చే శుక్ర, శనివారాల్లో వాయు కాలుష్య స్థాయిలలో మరింత మెరుగుదల కనిపిస్తుందన్నారు.

Read Also: Hyderabad: పాతబస్తీలో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమేనా?

కాగా, గురువారం ఉదయం నాటికి ఐదు ప్రధాన నగరాలు “పేలవమైన” గాలి నాణ్యతను నమోదు చేసినట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. ఢిల్లీ ఈరోజు దేశంలో అత్యధిక కాలుష్య స్థాయిలను నమోదు చేసింది. ఇక, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో జైపూర్ AQI 235, చండీగఢ్ AQI 233తో ఉన్నాయి. ఐజ్వాల్ AQI 32, గౌహతి AQI 42లలో అత్యల్ప కాలుష్య స్థాయిలు ఉన్నాయని పొల్యూషన్ బోర్డు ప్రకటించింది.

Show comments