Kubera : ధనుష్ ‘కుబేర’ రిలీజ్ డేట్ లాక్.. శేఖర్ కమ్ముల ప్లాన్ మామూలుగా లేదుగా
- ధనుష్ కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్ ?
- రష్మిక హీరోయిన్, నాగార్జున గెస్ట్ రోల్
- దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kubera : ధనుష్ హీరోగా నేషనల్ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ఇండియా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శేఖర్ కమ్ముల సినిమా అంటే అందులో కచ్చితంగా బలమైన కథ ఉంటుంది. ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆసియాన్ సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా భాషలలో రానున్న ఈ ఏడాదిలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
Read Also:AP Assembly Session: నేడు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమాలోని ఫస్ట్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. డైలాగ్స్ ఏమి లేకుండా కేవలం మ్యూజిక్ తో పాత్రలను ఇంట్రడ్యూస్ చేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల. గ్లిమ్స్ అద్భుతంగా ఉందనే చెప్పాలి. బిచ్చగాడి పాత్రలో ధనుష్ కనిపించగా అక్కినేని నాగార్జున బిజినెస్ టైకున్ పాత్రలో తళుక్కుమన్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గ్లిమ్స్ కు మరింత బలం చేకూర్చింది. తొలిసారి తన పంథా మార్చుకుని శేఖర్ కమ్ముల చేస్తున్న కుబేర ధనుష్ కు తెలుగులో మరో హిట్ సినిమా వచ్చేలా ఉంది. కేవలం పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశ ఇప్పటికే జరుగుతోంది. కాగా కుబేర చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
Read Also:Hyderabad: పాతబస్తీలో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమేనా?
ఇక ఈ చిత్రం కోసం అభిమానులు కూడా ఆసక్తిగానే ఉన్నారు. అయితే రోజుకో అప్ డేట్ ఇస్తూ వస్తున్న మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ఎపుడనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. దీనితో సస్పెన్స్ గానే మిగిలిపోగా ఇపుడు ఫైనల్ గా రిలీజ్ డేట్ పై అయితే ఆసక్తికర వార్త వినిపిస్తుంది. దీని ప్రకారం “కుబేర” వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 కి మేకర్స్ షెడ్యూల్ చేసినట్లుగా వినిపిస్తుంది. మరి దీనిపై అఫీషియల్ గా ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని చెప్పాలి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?