IRS Officer Daughter Murder: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ! వెలుగులోకి సంచలన విషయాలు
- ఐఆర్ఎస్ అధికారి కుమార్తె కేసులో వీడిన మిస్టరీ!
- ఓయో హోటల్‌లో నిందితుడు అరెస్ట్
- వెలుగులోకి సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం కుమార్తె విగతజీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి డాగ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు నిర్వహించారు. అలాగే సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పరిశీలించారు. సీసీకెమెరాల్లో రికార్డైన ఆధారాలతో ద్వారకా ప్రాంతంలో ఓయో హోటల్‌లో నక్కిన నిందితుడు రాహుల్(19)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుడు రాహుల్.. ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్యాచారానికి కొన్ని గంటల ముందు రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలో ఒక మహిళపై అత్యాచారం చేసినట్లుగా దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితుడి బ్యాగ్రౌండ్‌పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకెన్ని నేరాలు చేశాడన్న విషయాలపై కూపీ లాగుతున్నారు.
Also Read
బుధవారం ఆగ్నేయ ఢిల్లీలోని తూర్పు కైలాష్ ప్రాంతంలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తె (22)పై అత్యాచారం చేసి హత్యకు గురైంది. ఆ సమయంలో తల్లిదండ్రులు జిమ్‌కు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికీ కుమార్తె విగతజీవిగా పడి ఉంది. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీకెమెరాలను జల్లెడ పట్టారు. సీసీకెమెరాలో నిందితుడి కదలికలు కనిపించాయి. బాధిత కుటుంబానికి చూపించగా మాజీ పనిమనిషిగా గుర్తించారు. డాగ్ స్క్వాడ్స్.. ఇరుగుపొరుగు పనివాళ్ల సమాచారంతో నిందితుడు రాహుల్‌ను ఓయో హోటల్‌లో అరెస్ట్ చేశారు.
బాధితురాలు.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసింది. ప్రస్తుతం యూపీఎస్సీకి సిద్ధమవుతోంది. చదువులో చురుకైన విద్యార్థిని. 12వ తరగతిలో టాపర్ కూడా. అయితే నిందితుడు రాహుల్ నెలన్నర క్రితం వరకు ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో పని చేశాడు. ఐఆర్ఎస్ అధికారి కార్యాలయంలోని ఒక సూపరింటెండెంట్ ఇచ్చిన సిఫార్సుతో రాహుల్‌ను నియమించుకున్నారు. అయితే అతడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఇరుగుపొరుగు ఇళ్లల్లో పని చేస్తున్నవారి దగ్గర నుంచి కూడా అప్పులు తీసుకోవడం.. తిరిగి ఇవ్వకపోవడం వంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వారి ఇచ్చిన సమాచారం మేరకు నిందితుడిని గంటల వ్యవధిలోనే హోటల్‌లో అరెస్ట్ చేశారు.
నిందితుడు రాహుల్‌ను విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలో అధికారి కుమార్తెపై అత్యాచారం, హత్య చేయడానికి కొన్ని గంటల ముందు రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతంలో పరిచయస్థురాలైన వివాహిత మహిళపై అత్యాచారం చేశాడు. బాధితురాలి భర్తతో రాహుల్‌కు స్నేహం ఉండడంతో తరుచుగా ఇంటికి వస్తుండే వాడు. బాధితురాలితో ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండేవాడు.. ఈ క్రమంలోనే మహిళపై అత్యాచారం చేశాడని.. ఈ విషయం బాధితురాలు భర్తకు తెలియడంతో భయంతో రాహుల్ ఢిల్లీకి వచ్చేశాడు.
అయితే ఐఆర్ఎస్ అధికారి ఇంటి విషయాలు నిందితుడికి క్షుణ్ణంగా తెలుసు. భార్యతో కలిసి అధికారి ఉదయాన్ని వాకింగ్, జిమ్‌కు వెళ్తారన్న విషయం తెలియడంతో నేరుగా ఇంటికి వచ్చేశాడు. ఆ సమయంలో అధికారి కుమార్తె ఒంటరిగా ఉంది. అయితే పరిచయమైన వ్యక్తే కదా? అని డోర్ తీసిందో.. ఏం జరిగిందో తెలియదు గానీ… ఒంటరిగా ఉన్న అధికారి కుమార్తెపై అత్యాచారం చేసి అనంతరం మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌తో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిందితుడు బలవంతంగా ఇంట్లోకి వెళ్లినట్టుగా పోలీసులకు ఆనవాళ్లు లభించలేదు. దీంతో అదనపు తాళంతో ఇంట్లోకి ప్రవేశించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
బాధితురాలు డీపీఎస్ ఆర్కే పురంలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. అనంతరం ఐఐటీ ఢిల్లీ నుంచి పట్టభద్రురాలైంది. ప్రస్తుతం యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతోంది. నృత్యకారిణి కూడా. నృత్య పోటీల్లో అనేక అవార్డులు కూడా గెలుచుకుంది. ఆమె అన్నయ్య ఒక బహుళజాతి సంస్థలో ఉన్నత పదవిలో ఉన్నాడు. తల్లి వైద్యురాలు.
CCTV Footage Of Suspect | Month After Being Fired, Help Rapes, Kills IRS Officer's Daughter In Delhi https://t.co/0ZzThTWZ7R pic.twitter.com/JIakc80ZPm
— NDTV (@ndtv) April 22, 2026
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!