Site icon NTV Telugu

P. Chidambaram: ఢిల్లీ హైకోర్టులో కేంద్ర మాజీమంత్రి చిదంబరానికి బిగ్ రిలీఫ్

Chidambaram

Chidambaram

P. Chidambaram: ఎయిర్‌సెల్- మ్యాక్సిస్‌ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. సింగిల్‌ జడ్జి ధర్మాసనం ఈమేరకు ఈడీకి నోటీసులు ఇచ్చింది. అయితే, ఎయిర్‌ సెల్‌- మ్యాక్సిస్‌ కేసులో చిందంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై ట్రయల్‌ కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌లు దాఖలు చేయడంతో.. కేంద్ర మాజీమంత్రిపై విచారణకు ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ చిందంబరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా విచారణకు స్టే విధించింది.

Read Also: Forgery Ginger Garlic Paste: హైదరాబాద్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ.. 50 కేజీల సింథటిక్ ఫుడ్ కలర్ స్వాధీనం

కాగా, పి. చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహించినప్పుడు ఎయిర్‌సెల్- మ్యాక్సిస్‌ ఒప్పందంలో ఫారిన్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు అనుమతుల్లో అవకతవకలు జరిగాయని అనేక ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలోనే చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై పోలీసులు కేసు నమోదు చేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించి 2018లో సీబీఐ, ఈడీ రెండు వేర్వేరు ఛార్జిషీట్లను దాఖలు చేసింది.

Exit mobile version