Site icon NTV Telugu

Afzal Guru Grave: “అప్జల్ గురు” సమాధిని తొలగించాలని పిల్.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..

Afzal Guru Grave

Afzal Guru Grave

Afzal Guru Grave: ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి ఉగ్రవాదులు అప్జల్ గురు, మక్బూల్ భట్ సమాధులను తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కింద నమోదైన ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం కొట్టేసింది. విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ దాఖలు చేసిన పిల్‌లో సమాధులు ‘తీర్థయాత్ర’ స్థలంగా మారాయని పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీనిపై డేటాను కోరింది.

Read Also: China New Virus: ఉత్తర కొరియాను వణికిస్తున్న.. చైనా కొత్త వైరస్..!

కోర్టు ఈ పిట్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే, సాక్ష్యాధారాలతో డేటాతో తిరిగి పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కోరింది. వార్తా పత్రిక కథనాలు, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులతో కోర్టు నిర్ణయం తీసుకోదని న్యాయమూర్తులు దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, తుషార్ రావు గెదేలా నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. ‘‘అఫ్జల్ గురును సమాధి చేసి 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు దీన్ని ఎందుకు లేవనెత్తుతున్నారు?’’ అని కోర్టు పిటిషనర్‌ని ప్రశ్నించింది. ఈ రెండు సమాధులు తీర్థయాత్ర స్థలాలుగా మారాయనే దానికి కోర్టు భౌతిక ఆధారాలను కోరింది.

2001 డిసెంబర్‌లో పార్లమెంటుపై దాడిలో తన పాత్రకు దోషిగా తేలి 2013 ఫిబ్రవరిలో అప్జల్ గురును ఉరితీశారు. 1984 ఫిబ్రవరిలో మక్బూల్ భట్‌కు ఉరి శిక్ష అమలు చేశారు. వీరిద్దరిని జైలు ఆవరణలోనే ఖననం చేశారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, యాకూబ్ మేమన్ వంటి ఉగ్రవాదులను జైలులోనే గోప్యంగా ఖననం చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. అదే విధంగా అప్జల్ గురు విషయంలో జరగాలని కోరారు.

Exit mobile version