Site icon NTV Telugu

Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. వాహనదారులకు ఇక్కట్లు

Delhirain

Delhirain

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా ఢిల్లీ-నోయిడా ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరం అతలాకుతలం అయింది. రహదారులు నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2023 తర్వాత మార్చి నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే అని వాతావరణ శాఖ తెలిపింది. గత మూడేళ్లలో మార్చి నెలలో ఢిల్లీలో అత్యధికంగా సగటున 9.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణ తెలుగు సినిమాకి నాలుగు మినార్లు..

ప్రస్తుతం ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. మరిన్ని రోజులు ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, బలమైన గాలులతో కూడిన వర్షం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీ, నోయిడా, దాద్రి, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో మోస్తరు వర్షం, మెరుపులు, వడగళ్ల వానతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Off The Record: చీపురుపల్లి టీడీపీలో పరిస్థితులపై కేడర్ లో కూడా గందరగోళం

‘‘ప్రస్తుతం ఉత్తర పాకిస్థాన్.. దానిని ఆనుకుని ఉన్న జమ్మూ కాశ్మీర్‌పై ఒక పశ్చిమ అవాంతరం కేంద్రీకృతమై ఉంది. దీంతో పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో హర్యానాపై ఏర్పడిన ఒక తుఫాను వలయం కారణంగా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లో కూడా వర్షాలు కురుస్తున్నాయి’’ అని వాతావరణ నిపుణుడు మహేష్ పలావత్ తెలిపారు.

Exit mobile version